Skip to main content

సై‘కాలేజీ’కి డిమాండ్!

సాక్షి ప్రతినిధి కర్నూలు: దేశంలో సైకాలజీ ఎడ్యుకేషన్‌ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతిష్టాత్మక కాలేజీలు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ గ్రాడ్యుయేట్, డిప్లొమో, పీజీ కోర్సులు అంది స్తున్నాయి.
Telangana State Public Service Commission Exam Dates
సై‘కాలేజీ’కి డిమాండ్!

డిగ్రీలో ఏ గ్రూపు చదివినా పీజీలో సైకాలజీని ఎంచుకో వచ్చు. గతంలో ఢిల్లీలోని రామానుజన్‌ కాలేజీతో పాటు యూని వర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ పరిధిలో సైకాలజీకి 30–40 వేల అప్లికేషన్లు మాత్ర మే వచ్చేవి. 2020–21లో 50–60వేల దరఖాస్తులు వచ్చాయి. 20 22లో 60వేలు దాటాయి. విద్యార్థులు ఎక్కువగా సైకాలజీపై ఆసక్తి చూపడంతో సైకాలజీ సీట్ల సంఖ్యను కూడా ఢిల్లీ యూనివర్సిటీ పెంచింది. ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూని వర్శిటీ)లో ఏటా 4–5వేల మంది చేరేవారు. ఇప్పుడు 10 వేల మంది అడ్మిషన్లు పొందుతున్నారు. అంటే సైకాలజీ చదివేవారి సంఖ్య రెట్టింపు అయింది.

బెంగళూరు జైన్‌ డీమ్డ్‌ యూనివర్శిటీ, అమిటి, పూణేలోని సింబయాసిస్, యూనివర్శిటీ ఆఫ్‌ లక్నో, బెనారస్‌తో పాటు అన్ని వర్సిటీల్లో కూడా అడ్మిషన్లు 50% తక్కువ కాకుండా పెరిగాయి. కొన్నింటిలో రెట్టింపయ్యాయి. రాష్ట్రంలో ఆంధ్రా, తిరుపతి ఎస్వీ వర్సిటీలో ఈ కోర్సు ఉంది. దేశ వ్యాప్తంగా 9వేల మంది మాత్రమే సైకాలజిస్టులు ఉన్నారు. కోవిడ్‌– 19 తర్వాత సైకాలజిస్టులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. వీరికి భారీగా వేతనాలు కూడా ఇస్తున్నారు. దీంతో చాలామంది ఈ సబ్జెక్టుపై ఆసక్తి పెంచుకున్నారు. అటు వర్సి టీలు కూడా క్లినికల్‌ సైకాలజీ, కౌన్సెలింగ్‌ సైకాలజీ, చైల్డ్‌ సైకాలజీ, కాగ్నిటివ్‌ సైకాలజీ, కల్చరల్‌ సైకాలజీ, క్రిమినల్‌ సైకాలజీ, ఎడ్యు కేషన్‌ సైకాలజీ, ఫోరెన్సిక్‌ సైకాలజీ, స్పోర్ట్స్‌ సైకాలజీ, న్యూరో సైకాలజీ పేరుతో ప్రత్యేక కోర్సులు అందిస్తున్నాయి.

  • పాతికేళ్ల కిందట మానసిక రోగం అంటే చాలామందికి తెలీదు. ఇప్పుడు 10మంది ఆస్పత్రికి వెళ్తే వారిలో నలుగురిని డాక్టర్లు సైకాలజిస్టుకు సిఫార్సు చేస్తున్నారు.
  • అభద్రత, ఆత్రుత, తదితర బాధలు పెరుగు తున్నాయి. దీంతో ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు ఉత్పన్నమవు తున్నాయి.
  • కార్పొరేట్‌ విద్య వచ్చాక పిల్లలను ఉద్యోగం సాధించే యంత్రాలుగా మాత్రమే యాజమాన్యాలు చూస్తున్నాయి. అందుకు తగ్గట్లే శిక్షణనిస్తున్నాయి. దాంతో వారిపైనా తీవ్రమైన ఒత్తిడి ఉంటోంది.
  • ముఖ్యంగా కోవిడ్‌–19 తర్వాత భర్త లను కోల్పోయిన భార్యలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, అమ్మా, నాన్నను కోల్పోయిన పిల్లలున్నారు. వీరందరూ మానసిక ఒత్తిడికి గురవు తున్నారు. అలాగే, కోవిడ్‌తో ఉపాధి కోల్పోయిన వారిదీ ఇదే పరిస్థితి.

ప్రతీ కాలేజీలో సైకాలజిస్టు తప్పనిసరిగా
ఉండాలని 2008లోనే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కేరళలో స్కూలు స్థాయి నుంచే సైకాలజిస్టులు ఉన్నారు. అందుకే వారి చదువు, జీవన విధానం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సైకాలజీ కోర్సుకు డిమాండ్ పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామం.
– సిరిగిరెడ్డి జయరెడ్డి, సైకాలజిస్టు, కర్నూలు

Published date : 04 Mar 2023 05:08PM

Photo Stories