QS World Rankings 2024: క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా సీయూ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ 2024లో నంబర్‌వన్‌గా చండీగఢ్ యూనివర్సిటీ(సీయూ) నిలిచింది.
క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా సీయూ
అన్నీ ప్రైవేటు వర్సిటీల జాబితాలో దేశవ్యాప్తంగా మొదటి ర్యాంకు సాధించిన సీయూ అంతర్జాతీయ ప్రమాణాలతో కలిగిన బోధనా సిబ్బంది, విదేశీ విద్యార్థులతో భారతదేశ విశ్వవిద్యాలయాల్లో రెండవస్థానాన్ని సీయూ ఆక్రమించింది. మొహాలి క్వాక్వరైల్లి సైమండ్స్(క్యూఎస్) ర్యాంకింగ్స్ 2024లో దేశంలోనే చండీగఢ్ విశ్వవిద్యాలయం అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది.
జూన్ 28న వెలువడిన ర్యాంకింగ్స్ జాబితాలో అన్ని ప్రైవేట్ యూనివర్సిటీ జాబితాలో తొలి ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (క్యూఎస్) 2024 జాబితాకు గాను 2,963 యూనివర్సిటీల్లో సర్వే చేసింది.