University Rankings: క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో – 12 భారతీయ విద్యాసంస్థలు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల విద్యా ప్రమాణాలను విశ్లేషించి ర్యాంక్‌లను ప్రకటించే బ్రిటన్‌కు చెందిన క్వాక్వారెల్లీ సైమండ్స్(క్యూఎస్) సంస్థ 2022 ఏడాదికి ర్యాంక్‌లను గురువారం ప్రకటించింది. క్యూఎస్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయ్‌బిలిటీ ర్యాంక్‌ల టాప్–500 జాబితాలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్)–బెంగళూరు సహా ఆరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లు స్థానం దక్కించుకున్నాయి. టాప్–500లో మొత్తం 12 భారతీయ ఉన్నత విద్యా సంస్థలు చోటు సంపాదించాయి. భారతీయ సంస్థల్లో ఐఐటీ బాంబే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సెంట్రల్ వర్సిటీలైన ఢిల్లీ విశ్వవిద్యాలయం, ముంబై యూనివర్సిటీ, కలకత్తా విశ్వవిద్యాలయం సైతం జాబితాలో ఉన్నాయి. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ(సోనిపట్), బిట్స్(పిలానీ) ప్రైవేట్ విశ్వవిద్యాలయాలూ చోటు సాధించి తమ సత్తా చాటాయి.