Skip to main content

University Grants Commission (UGC): ఇకపై ఇక్క‌డ‌ ఏటా రెండు సార్లు అడ్మిషన్లు

న్యూఢిల్లీ: విదేశీ వర్సిటీల తరహాలో భారతీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు ఇకపై ఏటా రెండు సార్లు అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టే అవకాశం కల్పిస్తామని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) చీఫ్‌ జగదీశ్‌ కుమార్‌ ప్రకటించారు.
Admissions twice a year

2024–25 విద్యాసంవత్సం నుంచి జూలై– ఆగస్ట్, జనవరి–ఫిబ్రవరి సీజన్లలో ఈ అడ్మిషన్లు ఉంటాయని ఆయన వెల్లడించారు. ‘‘ బోర్డ్‌ పరీక్షల తుది ఫలితాలు ఆలస్యంగా ప్రకటించడం, ఆరోగ్య సమస్యలు, ఇతర వ్యక్తిగత కారణాలతో ఆ ఏడాది అడ్మిషన్‌ను కోల్పోయిన విద్యార్థులకు ఈ కొత్త విధానం ఎంతో ఉపయోగకరం.

చదవండి: Child Choice in Education: కాలేజీ సమయం.. చదువు ఎంపికలో పిల్లల మాట కూడా వినండయ్యా..

ప్రస్తుత విద్యాసంవత్సరంలో అడ్మిషన్‌ను పొందే అవకాశం కోల్పోతే తదుపరి అకడమిక్‌ సంవత్సరందాకా వేచి ఉండాల్సిన పనిలేదు. ఆర్నెళ్ల తర్వాత మొదలయ్యే అడ్మిషన్‌ ప్రక్రియలో సీటు కోసం ప్రయత్నించవచ్చు. ప్రాంగణ నియామకాలు చేపట్టే సంస్థలు, పరిశ్రమలు సైతం ఏటా రెండుసార్లు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు మొగ్గుచూపొచ్చు. దాంతో గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు రెట్టింపు అయ్యే సదవకాశం ఉంది’ అని జగదీశ్‌ వివరించారు. 

చదవండి: Beginning of Academic Year: ఇక చదువుల సీజన్‌.. జోరందుకున్న అడ్మిషన్లు

Published date : 12 Jun 2024 01:27PM

Photo Stories