ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత విద్యా రంగానికి సంబంధించిన విశ్లేషణలు అందించే ‘క్యూఎస్’ అంటే..
Sakshi Education
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత విద్యా రంగానికి సంబంధించిన విశ్లేషణలు అందించే సంస్థ ‘‘క్వాక్వారెల్లి సైమండ్స్’’. దీనినే ‘క్యూఎస్’గా పేర్కొంటారు.
ఈ సంస్థ 2004 నుంచి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అందిస్తోంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రధాన కార్యాలయంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఈ సంస్థ విద్యాసంస్థల పనితీరును గుర్తించి తులనాత్మక డేటా అందించడం ద్వారా ప్రాచుర్యం పొందింది. క్యూఎస్.. అంతర్జాతీయంగా విద్యార్థుల మనోభావాలు, వారు ఏం కోరుకుంటున్నారో కూడా సమగ్ర సర్వే చేసి అందిస్తుంది. ప్రపంచంలో ప్రముఖ విద్యా సంస్థలు, యూనివర్సిటీలు సైతం క్యూఎస్ రిపోర్టును ప్రామాణికంగా తీసుకుని తమ పనితీరును, విధానాలను మెరుగుపరచుకుంటాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ (సబ్జెక్టుల వారీగా) కోసం ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ అండ్ మెడిసి¯Œన్, నేచురల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగాల నుంచి సబ్జెక్టులను ఎంచుకుని.. అకడెమిక్స్, యజమాన్యం, పరిశోధనల ప్రభావం, సంస్థ పరిశోధనలు, అధ్యాపకుల ఉత్పాదకత ఆధారంగా పనితీరును లెక్కించి ర్యాంకులు ప్రకటిస్తుంది.
పూర్తి సమాచారంæ కోసం: https://www.topuniversities.com/university&rankings
ఇంకా చదవండి: part 1: టాప్ 100లో భారత ఇన్‌స్టిట్యూట్స్.. ఇన్‌స్టిట్యూట్ వారీగా ర్యాంకింగ్ ఇలా..
పూర్తి సమాచారంæ కోసం: https://www.topuniversities.com/university&rankings
ఇంకా చదవండి: part 1: టాప్ 100లో భారత ఇన్‌స్టిట్యూట్స్.. ఇన్‌స్టిట్యూట్ వారీగా ర్యాంకింగ్ ఇలా..
Published date : 15 Mar 2021 03:14PM