Valipe Ramgopal Rao: జాతీయ విద్యా విధానంలో భారీ మార్పులు!
కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే జాతీయ విద్యా విధానంలో ఇందుకు సంబంధించి భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశ విద్యా విధానాన్ని సరళతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మార్చి 6న నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
చదవండి: ఢిల్లీ ఐఐటీ కరోనా కిట్‌కు ఐసీఎంఆర్ ఆమోదం
మార్పునకు శ్రీకారం చుట్టాలి
‘దేశంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో సీట్లకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మెడిసిన్ చదివేందుకు మాత్రం ఎక్కువ శాతం మంది విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. అక్కడ ఫీజులు తక్కువ ఉండటమే ఇందుకు కారణం. మన దేశంలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలంటే కఠిన నిబంధనలు ఉన్నాయి. వాటిని సవరించేలా జాతీయ విద్యావిధానాన్ని సరళతరం చేయాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఐఐటీ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ డిగ్రీ కోర్సును ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తున్నాం. ఢిల్లీ ఐఐటీలో మెడిసిన్ పీహెచ్‌డీ కోర్సును ప్రారంభించబోతున్నాం’ అని రాంగోపాల్‌రావు అన్నారు.
చదవండి: తక్కువ ఖర్చుతో కరోనా టెస్ట్ కిట్‌ను రూపొందించిన ఢిల్లీ ఐఐటీ
నానో స్టార్టప్‌లకు ప్రోత్సాహం
నానో స్టార్టప్‌లకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం కలి్పస్తోందని తెలిపారు. మున్ముందు అన్ని రంగాల్లోనూ నానో ప్రభావం ఉంటుందన్నారు. నూతనంగా చేపట్టబోయే స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించేందుకు కేంద్రం రూ.300 కోట్లు కేటాయించిందన్నారు. ప్రజలకు మేలు చేసే, ఉపాధి అవకాశాలు పెంపొందించే స్టార్టప్‌లకు ఐఐటీ ఖరగ్‌పూర్ తగిన ప్రోత్సాహం అందిస్తుందన్నారు. గత పదేళ్లలో ఐఐటీ చదివిన వారిలో 95 శాతం మంది దేశంలోనే ఉద్యోగాలు చేస్తున్నారని లేదా పరిశ్రమలు స్థాపిస్తున్నారని చెప్పారు.