Awareness Conference: జాతీయ విద్యా విధానంపై అవగాహన సదస్సు
ఉండ్రాజవరం: క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అందించడమే తమ లక్ష్యమని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ అన్నారు. మండలంలో వేలివెన్ను శశి క్యాంపస్‌లో జాతీయ విద్యావిధానం, సీబీఎస్‌ఈ కోర్సుపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ విద్యా విధానంలో అనేక మార్పులు జరిగాయని దానికి అనుగుణంగా శశి వేలివెన్ను క్యాంపస్‌లో విద్యా ప్రణాళికలో మార్పులు చేశామని, సీబీఎస్‌ఈతో విద్యార్థులు జాతీయ స్ధాయి పరీక్షల (ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్)లో రాణిస్తున్నారన్నారు.
Staff Remuneration: గతంతో పోలిస్తే ఈసారి పరీక్ష కేంద్రాల్లోని సిబ్బందుల వేతనం ఇంత..!
అకడమిక్ డైరెక్టర్ చిట్టూరి శేషుబాబు మాట్లాడుతూ 10వ తరగతి తరువాత విద్యార్థి దశ చాలా కీలకమైనదన్నారు. మరో అకడమిక్ డైరెక్టర్ మన్నె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 44 సంవత్సరాల అనుభవం ఉన్న అధ్యాపక బృందంతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నామన్నారు.
Admissions 2024: ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశానికి గడువు పెంపు