Skip to main content

Staff Remuneration: గతంతో పోలిస్తే ఈసారి పరీక్ష కేం‍ద్రాల్లోని సిబ్బందుల వేతనం ఇంత..!

గతంతో పోలిస్తే పరీక్ష కేం‍ద్రాల్లో ఉండే సిబ్బందికి విద్యా శాఖ అందజేసే వేతనం ఈసారి పెంచేసింది. ఈ నేపథ్యంలో విద్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్రంలో ఉండే ప్రతీ సిబ్బందికి పెంచిన వేతనం గురించి వివరంగా తెలిపారు..
Teachers who are evaluating ten exams last year

కంకిపాడు: పదో తరగతి పరీక్షల నిర్వహణలో భాగస్వాములు, అనంతరం నిర్వహించనున్న స్పాట్‌ వాల్యుయేషన్‌లో పాల్గొనే సిబ్బందికి రెమ్యూనరేషన్‌ను పెంచుతూ పాఠశాల విద్య (పరీక్షలు) శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ క్షేత్రస్థాయి నివేదికను ఇటీవల సంబంధిత శాఖకు నివేదించటంతో రెమ్యూనరేషన్‌ పెంపు ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రధానంగా అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌కు పేపరుకు గతంలో రూ.6.60 ఇచ్చేవారు. దానిని రూ.10కి పెంపుదల చేయటం గమనార్హం.

Admissions 2024: ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశానికి గడువు పెంపు

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 18వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఈనెల 30వ తేదీతో పరీక్షలు ముగియనున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే కృష్ణాజిల్లాలో 151 పరీక్ష కేంద్రాల్లో రెగ్యులర్‌ విద్యార్థులు 21,458 మంది, ప్రైవేటు విద్యార్థులు 5,049 మంది రాస్తున్నారు.

Quiz of The Day (March 30, 2024): రాజ్యాంగ పీఠికకు సంబంధించిన తొలి సవరణ ఏది?

పరీక్షలు నిర్వహిస్తున్న 151 పరీక్ష కేంద్రాలకు డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లను చీఫ్‌ సూపరింటెండెంట్‌లుగా నియమించారు. వీరితో రూట్‌ ఆఫీసర్లు 10 మంది, సహాయ రూట్‌ ఆఫీసర్లు 10 మంది, 34 మంది కస్టోడియన్స్‌, 19 మంది సిట్టింగ్‌ స్క్వాడ్స్‌, ముగ్గురు సభ్యులతో కూడిన ఐదు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించి జిల్లా స్థాయి అధికారులు నిరంతరం పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. వీరందరికీ రెమ్యూనరేషన్‌ పెరగనుంది.

Jubilee High School: మూల్యాంకన సమయంలో ఎటువంటి తప్పిదాలకు ఆస్కా­రం లేకుండా చర్యలు..

పరీక్షల నిర్వహణలో పాల్గొన్న సిబ్బందికి వర్తింపు

పదో తరగతి పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన సిబ్బందికి రెమ్యూనరేషన్‌ను విద్యాశాఖ భారీగా పెంచింది. పేపర్‌సెట్టర్‌కి గతంలో రోజుకు రూ.880 కాగా, ప్రస్తుతం దానిని రూ.1320కి పెంచింది. ట్రాన్స్‌లేటర్‌కు రూ.770 నుంచి రూ.1155, మోడరేటర్‌కు రూ.770 నుంచి రూ.1155, చీఫ్‌ సూపరింటెండెంట్‌కు రూ.44 నుంచి రూ 66, డిపార్ట్‌మెంట్‌ అధికారులు/అదనపు అధికారులకు రూ.44 నుంచి రూ.66 చెల్లించనున్నారు.

AP 10th Class Evaluation & Results: టెన్త్‌ మూల్యాంకనానికి సర్వం సిద్ధం.. ఈసారి ఫలితాలు మాత్రం ఇలా..

ఇన్విజిలేటర్లకు ప్రతి 20 మంది విద్యార్థులకు గానూ రూ.22 నుంచి రూ.33, క్లర్క్స్‌కి రూ.22 నుంచి రూ.33, అటెండర్లకు ప్రతి 100 మంది విద్యార్థులకు రూ.13.20 నుంచి రూ.20, వాటర్‌మెన్‌కు ప్రతి 50 మందికి రూ.11 నుంచి రూ.17, సిట్టింగ్‌ స్క్వాడ్‌/ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు రూ.44 నుంచి రూ.66, కంటింజెంట్‌ పనులకు రూ.8 నుంచి రూ.10, మెడికల్‌ స్టాఫ్‌కి రూ.22 నుంచి రూ.33, జిల్లా స్థాయి పరిశీలకులకు రూ.200 నుంచి రూ.300 పెంచారు.

Tenth Class Evaluation 2024 : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జవాబు పత్రాల మూల్యాంకనం కు సర్వం సిద్ధం.... రీ వెరిఫికేషన్‌కు ఆన్‌లైన్‌ విధానం

స్పాట్‌కు సైతం పెంపు

ఏప్రిల్‌ మొదటి వారం నుంచి పదో తరగతి జవాబు పత్రాల స్పాట్‌ వాల్యుయేషన్‌ జరగనుంది. స్పాట్‌ వాల్యుయేషన్‌కు జిల్లాలో చీఫ్‌ ఎగ్జామినర్స్‌ 98 మంది, అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌లు 584 మంది, స్పెషల్‌ అసిస్టెంట్‌లు 196 మందిని నియమించారు. వీరితో పాటుగా స్పాట్‌ వాల్యుయేషన్‌ను పర్యవేక్షించేందుకు వివిధ స్థాయి అధికారులకు బాధ్యతలను అప్పగించారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బందికి వారి కేటగిరీ ఆధారంగా రె మ్యూనరేషన్‌ను పెంచారు. క్యాంప్‌ ఆఫీసర్‌కు రోజు కు రూ.385 నుంచి రూ.578కి పెంచారు.

School Admissions: ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు.. చివరి తేదీ..?

డెప్యూటీ క్యాంప్‌ ఆఫీసర్‌లు (స్ట్రాంగ్‌ రూమ్‌/ అడ్మినిస్ట్రేషన్‌) కు రూ.330 నుంచి రూ.495, అసిస్టెంట్‌ క్యాంప్‌ ఆఫీసర్‌కు రూ.286 నుంచి రూ.429, చీఫ్‌ ఎగ్జామినర్‌కు రూ.264 నుంచి రూ.396, అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ (స్క్రిప్ట్‌ వాల్యుయేషన్‌) రూ.6.60 నుంచి రూ.10కి పెంచారు. స్పెషల్‌ అసిస్టెంట్‌లకు రూ.137 నుంచి రూ.300, క్లరికల్‌ అసిస్టెంట్‌కు రూ.88 నుంచి రూ.132, ఆఫీస్‌ సబార్డినేట్స్‌, కంటింజెంట్‌ ఉద్యోగులకు రూ.55 నుంచి రూ.83, చీఫ్‌ కోడింగ్‌ అధికారులకు రూ.220 నుంచి రూ.330, సహాయ కోడింగ్‌ అధికారులకు రూ.198 నుంచి రూ.297, మూల్యాంకన నిబంధనలను రూపొందించే ఎగ్జామినర్స్‌కి రూ.250 నుంచి రూ.375 రెమ్యూనరేషన్‌ అందనుంది.

North Korea: ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ.. వ్యతిరేకించిన దేశం ఇదే..

ఉత్తర్వులు అందాయి

పదో తరగతి పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయి. అన్ని శాఖల సంయుక్త భాగస్వామ్యంతో విజయవంతంగా పరీక్షలు నిర్వహించాం. పరీక్షల నిర్వహణ, స్పాట్‌ వాల్యుయేషన్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ వారి కేటగిరీకి అనుగుణంగా రెమ్యూనరేషన్‌ను పెంపుదల చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తాం.

–తాహెరా సుల్తానా, డీఈఓ, కృష్ణాజిల్లా

Papers Evaluation: మూల్యాంకన కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి

Published date : 30 Mar 2024 12:29PM

Photo Stories