Papers Evaluation: మూల్యాంకన కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి
విశాఖ విద్య: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం రాష్ట్ర డైరెక్టర్ డి.దేవానంద్‌రెడ్డి సూచించారు. జ్ఞానాపురం జూబ్లీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన మూల్యాంకనం కేంద్రాన్ని శుక్రవారం ఆయన డీఈవో ఎల్.చంద్రకళతో కలిసి పరిశీలించారు. కేంద్రంలోని అన్ని గదులను తనిఖీ చేశారు. విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులకు కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
Engineering College: ఇంజనీరింగ్ కళాశాలలో 16వ వార్షికోత్సవం
మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో పాత పోస్టాఫీసు సెంటర్‌లో ఉన్న క్వీన్‌మేరీ ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో మూల్యాంకనం కేంద్రం ఉండేదని, మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా ఈ ఏడాది జ్ఞానాపురం జూబ్లీ హైస్కూల్‌కు మార్పు చేసినట్లు డీఈవో తెలిపారు. ప్రభుత్వ పరీక్షల జిల్లా కమిషనర్ మురళీమోహన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
North Korea: ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ.. వ్యతిరేకించిన దేశం ఇదే..