Engineering College: ఇంజనీరింగ్ కళాశాలలో 16వ వార్షికోత్సవం
Sakshi Education
ఎస్‌ఆర్‌ఐటీ అటానమస్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేడుకకు పలువురు ముఖ్య అతిథులు హాజరై సందడి చేశారు..
![Actor Shafi gets felicitated during the Annual Day at SRIT Engineering College](/sites/default/files/images/2024/03/30/srit-engineering-college-1711774929.jpg)
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని రోటరీపురం వద్ద ఉన్న శ్రీనివాస రామానుజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్‌ఆర్‌ఐటీ) అటానమస్ ఇంజినీరింగ్ కళాశాలలో 16వ వార్షికోత్సవం శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల చైర్‌పర్సన్, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, కరెస్పాండెంట్, ఏపీ ప్రభుత్వ విద్య సలహాదాలురు సాంబశివారెడ్డి, ప్రముఖ నటుడు షఫీ హాజరయ్యారు.
AP Tenth Class Results 2024 Date and Time : ఏపీ పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..?
కళాశాలలో బ్రాంచ్ టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు, ఉత్తమ సేవలు అందించిన అధ్యాపకులకు బహుమతులు అందజేశారు. అనంతరం కళాశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు చేసిన డ్యాన్స్‌లు యువతను ఉర్రూతలూగించాయి. విద్యార్థుఽలతో కలసి సినీ యాక్టర్ షఫీ సందడి చేశారు.
Published date : 30 Mar 2024 10:32AM