Skip to main content

డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ మార్పు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరం ప్రవేశాలకు షెడ్యూల్‌ మార్పు చేసినట్లు కన్వీనర్‌ ఆచార్య దారపురెడ్డి సూర్యచంద్రరావు ఆగస్టు 7న తెలిపారు.
Degree Admissions
డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ మార్పు

డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం విద్యార్థులు ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో ఆగస్టు 15 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఏదైనా సర్టిఫికెట్‌ పొందుపరచడం మరిచిపోతే, ఆగస్టు 16 నుంచి 18 వరకు పెండింగ్‌ సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేసి, మరోమారు ధ్రువీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించారు. గుర్తింపు (అఫిలియేషన్‌) ఇచ్చిన కాలేజీల జాబితాను యూనివర్సిటీ అధికారులు ఆగస్టు 20, 21 తేదీల్లో వెబ్‌సైట్‌లో ఉంచాలి. ఆగస్టు 22 నుంచి 26 వరకు విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలో డిగ్రీ ప్రవేశం కోసం వెబ్‌సైట్‌ ద్వారా ఎంపిక చేసుకోవాలి. 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్‌ ఒకటి, రెండో తేదీల్లో విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలి. సెప్టెంబర్‌ రెండో తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించేలా ఉన్నత విద్యామండలి తాజాగా షెడ్యూల్‌ విడుదల చేసింది.

చదవండి: 

Published date : 08 Aug 2022 04:02PM

Photo Stories