ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్‌లో కొత్త కోర్సులను ఐఐటీ మద్రాస్ అందిస్తోంది.
‘ఐఐటీ మద్రాస్’బీఎస్సీ డిగ్రీలో కొత్త సబ్జెక్టులు
నగరంలో ఆగస్టు 4న ఓ సమావేశంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. 4 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన బీఎస్సీ డిగ్రీని తాము అందిస్తున్నామని.. చివరి ఏడాదిలో కంపెనీలు, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో 8నెలల అప్రెంటిషిప్ చేసేందుకు విద్యార్థులకు అవకాశం దక్కుతుందన్నారు. డేటా విజువలైజేషన్ డిజైన్, ఇండస్ట్రీ 4.0, బయో ఇన్ఫర్మేటిక్స్‌లో అల్గారిథమిక్ థింకింగ్ వంటి కొత్త సబ్జెక్టులు ప్రవేశ పెట్టామని తెలిపారు. తరగతులు ఆన్‌లైన్‌లో జరుగుతాయని ఎక్కడ నుంచి ఎవరైనా ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. దరఖాస్తులను ఆగస్టు 19వ తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపారు.