IIT Madras: ఐఐటీఎం ఆచార్యునికి ప్రతిష్టాత్మక పురస్కారం
Sakshi Education
సౌదీ అరేబియా ఇచ్చే ప్రతిష్టాత్మక ‘ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ప్రైజ్’కు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్(ఐఐటీఎం) ఆచార్యుడు టి.ప్రదీప్ ఎంపికయ్యారు. నీటికి సంబంధించిన ఆవిష్కరణల్లో పురోగతి సాధించిన వారికి ‘క్రియేటివిటీ ప్రైజ్’ కింద ‘ఇంటర్నేషనల్ సైంటిఫిక్ అవార్డు’ అందజేస్తారని ఐఐటీ వర్గాలు తెలిపాయి. బహుమతిగా 2,66,000 యూఎస్ డాలర్లు (రూ.రెండు కోట్ల మేరకు) అందుతుందని పేర్కొన్నాయి. ‘వాటర్ పాజిటివ్’ అనే అంశం మీద పర్యావరణ అనుకూల పరిశోధనను ఆచార్య ప్రదీప్ చేశారు. గతంలో ఈయన పరిశోధనలకు కేంద్రం నుంచి పద్మశ్రీ, నిక్కే ఏషియా నుంచి ప్రత్యేక బహుమతి అందుకున్నారు.
GK Persons Quiz: ఈ సంవత్సరం జ్యూరీ సభ్యురాలిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనబోయే భారతీయ నటి?
Published date : 23 Jun 2022 03:51PM