Online Admissions : డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తులు.. చివరి తేదీ!
గుంటూరు: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికై ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు ఈనెల 10వ తేదీ వరకు అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) అమల్లో భాగంగా సమూల మార్పులతో డిగ్రీ కోర్సులను తీర్చిదిద్దిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గత రెండు విద్యాసంవత్సరాల్లో అమలు పరుస్తూ వచ్చిన ఆన్‌లైన్ అడ్మిషన్స్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ) విధానంలోనే 2024–25 విద్యాసంవత్సరానికి ప్రభుత్వం అడ్మిషన్లు కల్పిస్తోంది. ఏపీ ఈఏపీసెట్ తరహాలో ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లను భర్తీ చేసిన విధానంలోనే డిగ్రీ కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తున్నారు.
గత ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల బాటలోనే అడ్మిషన్లు
విద్యారంగంలో గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన సంస్కరణల్లో భాగంగా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు పారదర్శక విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం డిగ్రీ కోర్సులకు ఇదే విధానంలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, బాపట్లలోని మహిళా కళాశాలలు, చేబ్రోలు, రేపల్లె, వినుకొండ, మాచర్లలోని కో–ఎడ్యుకేషన్ కళాశాలలతోపాటు ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాలు జరుగుతున్నాయి.
ITI Admissions: ఐటీఐలో అడ్మీషన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు 10 వరకు గడువు
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 10 వరకు గడువు ఉంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో (sets.apsche.ap.gov.in) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ఓసీ విద్యార్థులు రూ.400, బీసీ రూ.300, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు రూ.200 చొప్పున డెబిట్, క్రెడిట్‌కాార్డు ద్వారా చెల్లించాలి. రిజిస్ట్రేషన్ సమయంలో అన్ని ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాల పరిశీలనకు హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. గుంటూరు జిల్లా పరిధిలోని విద్యార్థుల కోసం గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రంలో శుక్రవారం నుంచి విద్యార్థుల ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో పరిశీలిస్తారు.
Tiger Attacks: పంజా విసురుతున్న పులి.. 315 మంది మృతి!
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు 10 వరకు గడువు
నేటి నుంచి హెల్ప్‌లైన్ కేంద్రంలో ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలలో హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తరహాలో సీట్ల కేటాయింపు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు
11 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఈనెల 11 నుంచి 15 వరకు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈనెల 19న సీట్ల కేటాయింపు జరపనుండగా, ఈనెల 20, 21, 22 తేదీల్లో విద్యార్థులు కళాశాలల్లో చేరాల్సి ఉంది. డిగ్రీ లో ప్రవేశానికై ఉద్దేశించిన పూర్తి వివరాలకు ఆన్‌లైన్‌లో పొందుపర్చిన నోటిఫికేషన్‌ను సందర్శించాలి.
Free Coaching for TET Candidates : ఏపీ టెట్‌కు ఆంధ్ర ముస్లిం కళాశాలలో ఉచిత శిక్షణ..