High Court: డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ ప్రవేశాలు వద్దు

ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు విచారణ జరిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఉన్నత విద్యా మండలిని ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు. అంతకుముందు.. కాలేజీల తరఫు న్యాయవాది శ్రీవిజయ్ వాదనలు వినిపిస్తూ, ఈ విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్ ప్రవేశాలను తప్పనిసరి చేస్తూ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ఇలా ప్రవేశాలను ఆన్‌లైన్ ద్వారానే చేపట్టాలని బలవంతం చేసే అధికారం ఉన్నత విద్యా మండలికి లేదన్నారు. ఇలా చేయడం కాలేజీల హక్కులను హరించడమేనన్నారు.
చదవండి: Degree: ప్రవేశాల కన్వీనర్‌గా కృష్ణా వర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగాధిపతి
రెండేళ్లుగా ఇదే విధానం
ప్రభుత్వ న్యాయవాది కె.రఘువీర్ వాదనలు వినిపిస్తూ, రెండేళ్లుగా ఆన్‌లైన్ విధానంలోనే ప్రవేశాలు చేపడుతున్నామన్నారు. గత ఏడాది కూడా ఆన్‌లైన్ విధానాన్ని ప్రశ్నిస్తూ పిటిషన్ దాఖలు చేయగా, అందులో జోక్యానికి హైకోర్టు నిరాకరించిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఏడాది ఆన్‌లైన్ ప్రవేశాలు, ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ మొదలైందన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, కొంత గడువునివ్వాలని ఆయన కోర్టును కోరారు.
చదవండి: Traditional Course: ట్రెండ్ మారిన సాధారణ డిగ్రీ.. నచ్చిన కాంబినేషన్‌తో మెచ్చిన డిగ్రీ