FCRI: విద్యార్థినికి కెనడా వర్సిటీ డాక్టోరల్ ఫెలోషిప్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ములుగు ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ) విద్యార్థిని జి.శ్వేతకు కెనడా లావల్ యూనివర్సిటీలో డాక్టోరల్ ప్రోగ్రామ్ (వుడ్ సైన్స్)లో అడ్మిషన్ లభించింది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన జి.తిరుపతిరెడ్డి, కవితల కుమార్తె శ్వేత ఎఫ్‌సీఆర్‌ఐ నుంచి మాస్టర్స్ పూర్తిచేశారు. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించడంతో శ్వేతను ఐఎఫ్‌ఎస్ అధికారిణి ప్రియాంక వర్ఘీస్ అభినందించారు. ఎఫ్‌సీఆర్‌ఐ కాలేజీ విద్యార్థులు శ్వేతను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
చదవండి:
ములుగు అటవీ కాలేజీలో ఫారెస్ట్రీ పీహెచ్‌డీకి నోటిఫికేషన్
FCRI: ఆలిండియా స్థాయిలో ఎఫ్‌సీఆర్‌ఐ విద్యార్థుల సత్తా
వన్ డిస్ట్రిక్ట్–వన్ గ్రీన్ అవార్డును కైవసం చేసుకున్న సంస్థ?
Published date : 17 Jun 2023 05:23PM