ములుగు అటవీ కాలేజీలో ఫారెస్ట్రీ పీహెచ్‌డీకి నోటిఫికేషన్
Sakshi Education
ములుగు (గజ్వేల్): సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్సీఆర్ఐ)లో 2022–23 విద్యాసంవత్సరం ఫారెస్ట్రీ కోర్సులో పీహెచ్డీ ప్రవేశానికి దరఖాస్తులు కోరుతూ జనవరి 20న నోటిఫికేషన్ విడుదలైంది.
ఆ వివరాలను ఎఫ్‌సీఆర్‌ఐ డీన్ ప్రియాంక వర్గీస్ వెల్లడించారు. ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు ఐకార్/యూజీసీ గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఫారెస్ట్రీ మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు https://www.fcrits.in వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ ఫోన్‌నంబర్: 8074350866, 8919477851లో సంప్రదించాలని సూచించారు.
చదవండి:
Telangana: అటవీ విస్తీర్ణంలో తెలంగాణకు రెండోస్థానం
Success Story: హైఫై లైఫ్ కాదనుకుని... ఐఎఫ్‌ఎస్‌కు
Tribal Women: అడవిని సృష్టించిన గిరిజన మహిళలు.. ఎలా అంటే..
Published date : 21 Jan 2023 01:07PM