Skip to main content

Telangana: అటవీ విస్తీర్ణంలో తెలంగాణకు రెండోస్థానం

Telangana records 2nd highest forest cover increase in India

హరితహారం కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తోంది. ఈ పథకంతో రాష్ట్రంలో ఏకంగా 632 చదరపు కిలోమీటర్లలో అదనపు పచ్చదనం పెరిగింది. దీంతో అటవీ విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం.. దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అశ్విని కుమార్‌ చౌబే రాజ్యసభలో ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం 2015–16లో ప్రారంభించిన హరితహారం కార్యక్రమం కింద 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది జనవరి నాటికి 235.59 కోట్ల మొక్కలు నాటారు. అంటే ఇది 102.6 శాతం అన్నమాట. ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌(ఐఎస్‌ఎఫ్‌ఆర్‌) 2021 ప్రకారం–తెలంగాణలో 21,214 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉంది. 2019–2021 మధ్య అటవీ విస్తీర్ణాన్ని పరిశీలిస్తే.. 632 చదరపు కిలోమీటర్ల పెరుగుదల ఉంది. దీంతో దేశంలోనే తెలంగాణ అటవీ విస్తీర్ణంలో రెండో రాష్ట్రంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 647 చదరపు కిలోమీటర్ల పెరుగుదలతో మొదటి స్థానంలో నిలిచింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 23 Dec 2022 06:38PM

Photo Stories