FCRI: ఆలిండియా స్థాయిలో ఎఫ్‌సీఆర్‌ఐ విద్యార్థుల సత్తా
. ఐసీఏఆర్ పీసీ ఏఐఈఈఏ–2021 ప్రవేశ పరీక్షలో ఎఫ్‌సీఆర్‌ఐ బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ–2018 విద్యార్థులు పలు ర్యాంకులు సాధించారు. వై.మల్లేశ్ అఖిల భారత స్థాయిలో 16వ ర్యాంకు సాధించాడు. ఎస్సీ కేటగిరీలో కె.రాజు, పీడబ్ల్యూడీ కేటగిరీలో జి.వైష్ణవి ప్రథమ ర్యాంకు సాధించారు. అఖిలభారత స్థాయిలో ఎస్టీ కేటగిరీలో డి.రాజేశ్వరి, ఎస్సీ కేటగిరీలో ఎ.సుప్రియ ద్వితీయ ర్యాంకులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చారు. తమ కాలేజీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందని ఎఫ్‌సీఆర్‌ఐ డీన్ ప్రియాంక వర్ఘీస్, డిప్యూటీ డైరెక్టర్ కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. కాగా, ములుగులోని ఎఫ్‌సీఆర్‌ఐలో ప్రపంచస్థాయి ప్రమాణాలు, సౌకర్యాలు, అధునాతన ప్రయోగశాలలు ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్, ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (విద్య) కంచన్‌దేవీ ప్రశంసించారు.