Skip to main content

TSCHE: బీకాం.. భారీగా ఇన్‌కం!.. సాఫ్ట్‌వేర్‌తో పోటీ...

సాక్షి, హైదరాబాద్‌: కొన్నేళ్లుగా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా బీకాం డిగ్రీ కోర్సుకు గిరాకీ పెరుగుతోంది. 2022–23 విద్యా సంవత్సరంలో మొత్తం డిగ్రీ సీట్లు 2,10,970 ఉంటే, అందులో 87,480 మంది కామర్స్‌ కోర్సుల్లోనే చేరారు.
TSCHE
బీకాం.. భారీగా ఇన్‌కం!.. సాఫ్ట్‌వేర్‌తో పోటీ...

అంటే 40 శాతంపైగా ఈ కోర్సును ఎంచుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగొచ్చని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ–కామర్స్‌ పెరిగిన తర్వాత ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉండటమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఆరేళ్ల కిందట 46 శాతం సైన్స్‌ విద్యార్థులు డిగ్రీలో చేరితే, ఇప్పుడు వీరి సంఖ్య 36 శాతానికి పడిపోయింది. రాష్ట్రంలోనూ మిగతా డిగ్రీ కోర్సులకన్నా, కామర్స్‌ను అన్ని ప్రాంతాల్లోనూ ఆధునీకరించారు. కంప్యూటర్స్, అనాలసిస్‌ వంటివి జోడించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కామర్స్‌ ద్వారా ఉపాధి లభిస్తోందని చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల మాదిరి వేతనాలు వస్తున్నాయనే అభిప్రాయం బలపడుతోంది. 2023లో స్కిల్‌ ఇండియా వెలువరించిన నివేదికలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. బీటెక్‌ విద్యార్థుల కన్నా.. బీకాం విద్యార్థులే 2023లో ఎక్కువ ఉద్యోగాలు పొందనున్నట్లు నివేదిక అంచనావేసింది. 2017లో 37.98 శాతం బీకాం విద్యార్థులు ఉద్యోగాలు పొందితే, 2023లో ఇది ఏకంగా 60.62 శాతానికి చేరనున్నట్లు విశ్లేషించింది. ఈ– కామర్స్‌ పెరగడం వల్ల అనలిస్టుల అవసరం పెరిగిందని, జీఎస్టీ తెచ్చిన తర్వాత ట్యాక్స్‌ నిపుణుల ప్రాధాన్యత ఎక్కువైందని ‘స్కిల్‌ ఇండియా’తెలిపింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్‌ బిజినెస్‌ వ్యవస్థ కూడా కామర్స్‌ కోర్సుల విద్యార్థులకు ఉపాధి పెంచేలా చేసినట్టు చెప్పింది. అనలిస్ట్‌ ఉద్యోగుల వేతనం కూడా మూడేళ్లలో 98 శాతం పెరిగినట్టు పేర్కొంది. 

చదవండి: TSCHE: డిగ్రీలో కొత్త కోర్సు.. కోర్సు ప్రత్యేకతలివీ...
కొత్త సబ్జెక్టుల మేళవింపు కామర్స్‌ కోర్సులో అనేక మార్పులు తెచ్చారు. కంప్యూటర్స్, ట్యాక్సేషన్, ఆనర్స్, బిజినెస్‌ అనలిటిక్స్‌ వంటి కొత్త సబ్జెక్టులు తెచ్చారు. స్టాక్‌ మార్కెట్‌ ట్రెండ్‌ను అంచనా వేసే టెక్నాలజీని కూడా మేళవించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్‌ రంగాల్లో కామర్స్‌ నేపథ్యం ఉన్న సిబ్బంది అవసరం పెరిగింది. 

చదవండి: TSCHE: డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ షురూ.. ప్రక్రియ తీరు ఇదీ.. ఇలా కూడా దోస్త్‌ రిజిస్ట్రేషన్‌..

స్కిల్‌ ఇండియా నివేదిక ప్రకారం... కొన్నేళ్లుగా ఏ కోర్సుతో ఎంత ఉపాధి (శాతంలో)? 

కోర్సు

2017

2018

2019

2020

2021

2022

2023

బీటెక్‌

50.69

51.52

57.09

49.00

46.82

55.15

57.44

ఎంబీఏ

42.28

39.4

36.44

54.00

46.59

55.09

60.1

బీఏ (ఆనర్స్‌)

35.66

37.39

29.3

48.00

42.72

44.2

49.2

బీకాం

37.98

33.93

30.6

47.00

40.3

42.62

60.62

బీఎస్సీ

31.76

33.62

47.37

34.00

30.34

38.06

37.69

ఎంసీఏ

31.36

43.85

43.19

25.00

22.42

29.3

30.64

ఐటీఐ

42.22

29.46

31.3

34.2

పాలిటెక్నిక్‌

25.77

32.67

18.05

32

25.02

21.42

27.61

బీఫార్మసీ

42.30

47.78

36.29

45

37.24

44.63

57.51 

Published date : 24 May 2023 01:29PM

Photo Stories