Skip to main content

Vallur Umamaheswara Rao: ఇస్రో శాస్త్రవేత్తకు సన్మానం

ఖమ్మం అర్బన్‌/ఖమ్మం సహకారనగర్‌: ఇటీవల ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌–3 ప్రయోగంలో పాలుపంచుకున్న ఖమ్మంకు చెందిన శాస్త్రవేత్త వల్లూరు ఉమామహేశ్వరరావును రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సన్మానించారు.
Awarded to ISRO Scientist
ఉమామహేశ్వరరావుతో నిర్మల్‌ హృదయ్‌ పాఠశాల యాజమాన్యం

 ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను సన్మానించిన మంత్రి మాట్లాడుతూ దేశం సత్తాను చాటిన ప్రయోగంలో ఖమ్మం వాసి పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్‌ కొత్తపల్లి నీరజ తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఉమామహేశ్వరరావు చదువుకున్న నిర్మల్‌ హృదయ్‌ పాఠశాలలో ఆయనను కరస్పాండెంట్‌ వంగా సాంబశివారెడ్డి, డైరెక్టర్‌ సుధాకర్‌రెడ్డి, హెచ్‌ఎంలు ఏ.పద్మజ, శ్రావణి తదితరులు సన్మానించారు.

చదవండి:

ISRO Scientist: ఎర్ర‌గుంట్ల విద్యార్థి ఇస్రో శాస్త్రవేత్త‌

Chandrayaan-3: చ‌దువుల్లో రారాజులు... చంద్ర‌యాన్ 3లో పాల్గొన్న శాస్త్ర‌వేత్త‌ల విద్యార్హ‌త‌లు ఇవే..!

ISRO: ఇస్రోలో నంద్యాల జిల్లా వాసి

Published date : 16 Sep 2023 02:48PM

Photo Stories