ISRO Scientist: ఎర్రగుంట్ల విద్యార్థి ఇస్రో శాస్త్రవేత్త
![FridayMeeting,Yerraguntla student is now a Scientist in ISRO, SchoolVisit,Chandrayaan3](/sites/default/files/images/2023/09/16/isro-scientist-copy-1694856882.jpg)
సాక్షి ఎడ్యుకేషన్: ఎర్రగుంట్లలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలో చదివిన ఎస్.మహబూబ్‌బాషా ఇస్రోలో పని చేస్తూ చంద్రయాన్–3లో భాగస్వామ్యం కావడం గర్వకారణంగా ఉందని హెచ్‌ఎం రామాంజనేయరెడ్డి తెలిపారు. శుక్రవారం ఇస్రో శాస్త్రవేత్త మహబూబ్‌బాషాను పాఠశాలలో ఉపాధ్యాయ బృందం సత్కరించి జీఎస్‌ఎల్‌వీ మోడల్‌ను బహూకరించారు.
Career in ISRO: అంతరిక్ష పరిశోధన సంస్థలో కెరీర్‌కు మార్గాలు
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి, ఇస్రో శాస్త్రవేత్త మహబూబ్‌బాషా మాట్లాడుతూ ఎర్రగుంట్ల పట్టణంలో 2004లో పదో తరగతి, ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా (ఈఈఈ కోర్సు), వాకాడలో బీటెక్ చదివినట్లు తెలిపారు. తర్వాత రిక్రూట్‌మెంట్‌లో ఇస్రోలో 2009–10లో చేరినట్లు పేర్కొన్నారు. అక్కడ సీఎంజీ విభాగంలో రాకెట్ లిఫ్ట్‌లో ఎలక్ట్రికల్‌లో సైంటిస్టుగా పని చేస్తున్నట్లు చెప్పారు. చంద్రయాన్–3లో పాల్గొనడం ఎంతో సంతోషకరమని, నా జీవితంలో మరిచిపోలేని సంఘటన అని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.