OU: పీజీ సెమిస్టర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
Sakshi Education

ఓయూ పరిధిలో మే 10నుంచి ప్రారంభంకానున్న వివిధ రెగ్యులర్ పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అడిషనల్ కంట్రోలర్ ప్రొ.అంజయ్య మే6న పేర్కొన్నారు. ఎం.ఎ, ఎం.కాం, ఎమ్మెస్సీ, ఇతర పీజీ కోర్సులు చదివే ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నేటి నుంచి ఆయా కాలేజీల్లో హాల్ టిక్కెట్లను పొందవచ్చన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్లో చూడవచ్చని తెలిపారు.

Published date : 07 May 2022 03:05PM