టీచర్ల బదిలీలకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..
ఈ ప్రక్రియ మార్చి 4వ తేదీ వరకు కొనసాగనుంది. అధికారులు నేడు ఖాళీలు, సీనియారిటీ జాబితాను విడుదల చేయనున్నారు. అర్హులైన టీచర్లు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు జనవరి 26న తెలంగాణ పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన ఉత్తర్వులు జారీచేశారు. బదిలీల కోసం వెబ్ కౌన్సెలింగ్, పదోన్నతులకు ప్రత్యక్ష కౌన్సెలింగ్ అనుసరిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే మలీ్టజోన్ పరిధిలోకి వచ్చే ప్రధానోపాధ్యాయుల ఖాళీల వివరాలపై అధికారులు స్పష్టత ఇచ్చారు.
చదవండి: Department of Education: ఆన్‌లైన్‌లోనే టీచర్ల బదిలీలు
జోన్–1లో 1,096, జోన్–2లో 906.. మొత్తం 2,002 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చారు. వీటిని స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. అయితే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల వివరాలు ప్రకటించాల్సి ఉంది. మరోవైపు స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా 70 శాతం మేర భర్తీ చేస్తారు. టీచర్ల సీనియారిటీ జాబితా, ఖాళీల సంఖ్య విడుదలైతే దీనిపై స్పష్టత వస్తుంది. బదిలీల కోసం 28 నుంచి 30వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన టీచర్ల డాక్యుమెంట్లను హెచ్‌ఎంలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకూ డీఈవోలకు సమరి్పంచాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
చదవండి: ఉపాధ్యాయుల నియామకం నాణ్యమైన విద్యకు సహాయపడుతుంది
పట్టణాల వైపే చూపు:
ఎక్కువమంది టీచర్లు పట్టణాలు, నగర ప్రాంతాల వైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఉన్నవాళ్లు సమీపంలోని స్కూళ్లను మొదటి అవకాశంగా ఎంచుకునే అవకాశముంది. బదిలీల్లో జీరో సరీ్వసుకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికే 317 జీవో కారణంగా స్థానికేతర జిల్లాల్లో మారుమూల ప్రాంతాలకు వెళ్లిన టీచర్లు బదిలీ అవకాశం కోల్పోతున్నారు. అప్పట్లో ఈ జీవో అమలు సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో ఖాళీలను అధికారులు బ్లాక్ చేశారు. ప్రధానోపాధ్యాయులు సంబంధిత స్కూల్‌లో ఐదేళ్లకు బదులు 8 ఏళ్లు ఉంటేనే బదిలీకి అర్హులని మార్పు చేయడం వల్ల మరికొంత కాలం ఎక్కువమంది హెచ్‌ఎంలు తమ తమ స్థానాల్లోనే ఉండే అవకాశం ఏర్పడింది.
చదవండి: Best Teacher: అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
తప్పుడు ధ్రువపత్రాలతో తంటా
బదిలీల్లో దీర్ఘకాలిక వ్యాధులు, 70 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు ప్రాధాన్యం ఉంటుంది. జీవిత భాగస్వామి సహా కుటుంబంలో ఎవరికైనా కేన్సర్, బోన్ టీబీ, బైపాస్ సర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, న్యూరో సర్జరీలతోపాటు కొత్తగా మస్క్యులర్ డిస్ట్రోఫీ, డయాలసిస్ ఉంటే బదిలీల్లో ప్రత్యేక కేటగిరీ ఇస్తున్నారు. దీన్ని అడ్డంపెట్టుకుని తప్పుడు ధ్రువీకరణపత్రాలతో కొంతమంది ప్రయోజనం పొందుతున్నారనే విమర్శలొస్తున్నాయి. 317 జీవో అమలులోనూ ఇలాంటి ఫిర్యాదులు అనేకం వచ్చాయి. దర్యాప్తులోనూ ఇవి నిజమని తేలాయి. ఈసారి దీన్ని కట్టడి చేయడానికి సరైన యంత్రాంగంలేదని పలువురు టీచర్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాళ్లకు అన్యాయమేనా?
ఇప్పటికే 317 జీవో ద్వారా బలవంతంగా వేలాదిమంది టీచర్లను స్థానికేతరులుగా పంపారు. 13 జిల్లాల్లో బదిలీలు నిలిపివేసి స్పౌజ్‌లకు అన్యాయం చేశారు. రెండేళ్ల సరీ్వస్ రూల్ తేవడం వల్ల మళ్లీ వాళ్లు నష్టపోవాల్సిందేనా? జీరో సర్వీస్ అమలు చేయాల్సిందే.
–ముత్యాల రవీందర్, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బోగస్ సరి్టఫికెట్ల సంగతేంటి?
గతంలో జరిగిన బదిలీల్లో బోగస్ మెడికల్ సర్టిఫికెట్లతో ప్రయోజనం పొందినవారిపై ఫిర్యాదులొచి్చనా పట్టించుకోలేదు. వాళ్ల సంగతేంటో చెప్పాలి. ఇప్పుడూ అలాంటి పరిస్థితి రాకుండా జీవోలో ఎలాంటి కట్టడి మార్గాలూ సూచించలేదు. దీనివల్ల కొంతమంది నష్టపోయే ప్రమాదం ఉంది.
– చందూరి రాజిరెడ్డి, టీఎస్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి