Best Teacher: అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
జనవరి 23న నాంపల్లి హజ్ హౌస్‌లోని ఉర్దూ అకాడమీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ స్కూల్, యూనివర్సిటీ విభాగంలో ఉపాధ్యాయులకు, అధ్యాపకులు ఇస్తున్న అవార్డుల వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ఉర్దూ మీడియం స్కూల్ టీచర్లు అవార్డుల కోసం జనవరి 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల పనితనంతో పాటు వారి ఆధ్వర్యంలో విద్యార్థులు సాధించిన మార్కులు పరిగణలోకి తీసుకుంటామన్నారు. ప్రతి జిల్లాకు ఐదుగురు ఉపాధ్యాయుల చొప్పున ఎంపిక చేసి 165 టీచర్లకు అవార్డులు అందజేస్తామన్నారు.
చదవండి: ఉర్దూ వర్సిటీకి న్యాక్ ఏ–ప్లస్ గ్రేడ్
అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీ విభాగంలో ఇద్దరు అధ్యాపకులకు, మెడికల్ యూనివర్సిటీ విభాగంలో ఇద్దరు అధ్యాపకులు కూడా ఈ అవార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఉర్దూ భాషాభివృద్ధి కోసం అకాడమీ అహర్నిశలు కృషి చేస్తుందని, ఇందులో భాగంగా ప్రభుత్వ ఉర్దూ స్కూళ్లలో మౌలిక సదుపాయలు కల్పించాలనే ఉద్దేశంతో ఉర్దూ అకాడమీ ప్రత్యేక పథకం అమలు చేస్తుందన్నారు.
చదవండి: Urdu Textbooks: సరికొత్తగా ఉర్దూ పాఠ్యపుస్తకాలు.. ఇమేజ్ మిర్రర్ టెక్నాలజీతో ముద్రణ
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక్కో ప్రభుత్వ ఉర్దూ స్కూలుకు రూ. 50వేల చొప్పున ఆరి్థక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ నిధులను పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వెచ్చించవచ్చునన్నారు. ఇందుకు ప్రభుత్వ ఉర్దూ మీడియం స్కూళ్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
చదవండి: Second Official Language: ఉర్దూను రెండో అధికారిక భాషగా ప్రకటించిన రాష్ట్రం?