Skip to main content

ఉర్దూ వర్సిటీకి న్యాక్‌ ఏ–ప్లస్‌ గ్రేడ్‌

రాయదుర్గం(హైదరాబాద్‌): మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌(న్యాక్‌) ద్వారా ఏ–ప్లస్‌ గ్రేడ్‌ గుర్తింపు లభించింది.
NAAC A Plus Grade for Urdu Varsity
ఉర్దూ వర్సిటీకి న్యాక్‌ ఏ–ప్లస్‌ గ్రేడ్‌

న్యాక్‌ పీర్‌ బృందం డిసెంబర్‌ 13 నుంచి 15వ తేదీ వరకు ఉర్దూ వర్సిటీలో పర్యటించి మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, పనితీరు, అకడమిక్‌ ఎక్స్‌లెన్స్‌ను అంచనా వేయగా నాలుగు పాయింట్‌ స్కేల్‌ నుంచి 3.36 సీజీపీఏ సాధించి ఏ–ప్లస్‌ గ్రేడ్‌ను పొందింది.

చదవండి: MANUU: ‘మనూ’లో కొత్త కోర్సు

ఈ సందర్భంగా ఉర్దూ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సయ్యద్‌ ఐనుల్‌ హసన్‌ మాట్లాడుతూ...పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఉర్దూ వర్సిటీకి మరోసారి న్యాక్‌ ద్వారా ఏ–ప్లస్‌ గ్రేడ్‌ లభించడం సమిష్టి కృషికి నిదర్శనమన్నారు. రి జిస్ట్రార్‌ ఆచార్య ఇష్తియాక్‌ అహ్మద్, ఏక్యూఏసీ డైరెక్టర్‌ ప్రొ. సయ్యద్‌ హసీబుద్దీన్‌ ఖాద్రీ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఉర్దూ యూనివర్సిటీకి గతంలో 2016, 2009లో వరుసగా రెండు చక్రాలలో న్యాక్‌చే ఏ గ్రేడ్‌ గుర్తింపును పొందింది. 

చదవండి: UGC – HRDC: మూడోస్థానంలో ‘మనూ’

Published date : 21 Dec 2022 01:05PM

Photo Stories