Second Official Language: ఉర్దూను రెండో అధికారిక భాషగా ప్రకటించిన రాష్ట్రం?
మైనార్టీల సంక్షేమం, ఉర్దూ భాషాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ మార్చి 23న ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ అధికార భాషల చట్ట సవరణ–2022 బిల్లును, కొత్తగా మైనార్టీల ప్రత్యేక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ కాంపోనెంట్ మరియు ఆర్థిక వనరులు, వ్యయ కేటాయింపులు మరియు వినియోగ చట్టం–2022 బిల్లును డిప్యూటీ సీఎం అంజాద్ బాష ప్రతిపాదించారు. ఈ రెండు బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
Telangana: క్వాల్కమ్ నూతన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు కానుంది?
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అంజాద్ బాష మాట్లాడుతూ.. ఉర్దూ ఒక మతానికి సంబంధించిన భాష కాదని, నిఖార్సయిన భారతీయ భాష అని చెప్పారు. ఇక వినియోగ చట్టం–2022 బిల్లుతో వచ్చే 10 ఏళ్లలో అల్ప సంఖ్యాక వర్గాలకు భద్రత, సామాజిక హోదాతో పాటు సమధర్మాన్ని పాటించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ఆర్థిక, విద్య, మానవ వనరుల అభివృద్ధి విషయాల్లో ఆయా వర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
32.45 లక్షల మందికి మాతృభాషగా..
ఉర్దూకు రెండో అధికారిక భాషగా చట్టబద్ధత కల్పించడంతో.. రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యకలాపాలు, ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగుతో పాటు ఉర్దూలోనూ సాగించేలా సమాన హోదా కల్పించినట్టయింది. రాష్ట్రంలో 32.45 లక్షల మందికి ఉర్దూ మాతృభాషగా ఉంది. ఉర్దూ మాట్లాడే ప్రజలు వైఎస్సార్ కడపలో 19 శాతం, గుంటూరులో 15.55 శాతం, చిత్తూరు 13.16 శాతం, అనంతపురంలో 12.91, కర్నూలు 11.55, కృష్ణాలో 8.42 శాతం, ప్రకాశంలో 5.65 శాతం, నెల్లూరులో 7.84 శాతం ఉన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ సుమరు రెండు శాతం ఉర్దూ మాట్లాడే ప్రజలున్నారు.
CM YS Jagan: రాష్ట్రంలోని ఏ జిల్లాలో పవర్‌లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటు కానుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అధికార భాషల చట్ట సవరణ–2022 బిల్లు, ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ కాంపోనెంట్ మరియు ఆర్థిక వనరులు, వ్యయ కేటాయింపులు మరియు వినియోగ చట్టం–2022 బిల్లులకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్ శాసన సభ
ఎందుకు : రాష్ట్రంలో ఉర్దూకు రెండో అధికారిక భాషగా చట్టబద్ధత కల్పించడంతోపాటు, మైనార్టీల సంక్షేమం కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్