Telangana: క్వాల్కమ్ నూతన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు కానుంది?
సాఫ్ట్‌వేర్, వైర్‌లెస్ టెక్నాలజీ, సెమీ కండక్టర్ల రంగంలో క్వాల్కమ్, గోల్ఫ్ బ్రాండ్‌లలో ‘కాల్‌అవే గోల్ఫ్’తోపాటు ఎలక్ట్రిక్ వాహన రంగంలోని ఫిస్కర్ కంపెనీ తమ కార్యాలయాలను త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌తో మార్చి 22న శాండియాగోలోని క్వాల్కమ్, కాల్‌అవే గోల్ఫ్, లాస్ ఏంజెలిస్‌లోని ఫిస్కర్ ప్రధాన కార్యాలయాల్లో ఆ సంస్థల ప్రతినిధులు సమావేశమై.. చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా ఆయా సంస్థల ప్రతినిధులు, మంత్రి కేటీఆర్ తెలిపిన వివరాల ప్రకారం..
- క్వాల్కమ్ ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో 2022, అక్టోబర్ నాటికి ప్రారంభించనుంది. వచ్చే ఐదేళ్లలో దశలవారీగా రూ.3,904 కోట్లు పెట్టనుంది.
- ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి డిజైన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు ప్రత్యేకంగా మొబిలిటీ క్లస్టర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందులో ఫిస్కర్ కంపెనీ భాగస్వామి కానుంది.
- కాల్‌అవే గోల్ఫ్ సంస్థ హైదరాబాద్‌లో డిజిటెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్ ద్వారా ప్రాథమిక దశలో 300 మంది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌తో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
TS Socio Economic Outlook: తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2021–22
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్వాల్కమ్, కాల్‌అవే గోల్ఫ్, ఫిస్కర్ కంపెనీల కార్యాలయాలు ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : కార్యకలాపాల విస్తరణలో భాగంగా..
CM YS Jagan: రాష్ట్రంలోని ఏ జిల్లాలో పవర్‌లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటు కానుంది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్