Urdu Textbooks: సరికొత్తగా ఉర్దూ పాఠ్యపుస్తకాలు.. ఇమేజ్ మిర్రర్ టెక్నాలజీతో ముద్రణ
విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో మూడేళ్లుగా జగనన్న విద్యాకానుక ద్వారా విద్యార్థులకు ఎనిమిది రకాల సామగ్రిని ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఉర్దూ పాఠ్య పుస్తకాలకు సైతం ప్రాధాన్యమిచ్చింది. ఉర్దూ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గత ప్రభుత్వ హయాంలో పాఠ్య పుస్తకాల పంపిణీ అనేది ఒక తీరు, తెన్ను లేని విధంగా ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులకు పాఠశాలలు తెరిచిన నెలల తరబడి పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పాఠశాలల్లో బుక్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసుకుని, పాఠశాలలో విద్య పూర్తి చేసుకుని వెళ్లిన విద్యార్థుల నుంచి పాత పుస్తకాలను సేకరించి, విద్యార్థులకు పంపిణీ చేసిన పరిస్థితులను ఉపాధ్యాయులు స్వయంగా చూశారు. ఇటువంటి పరిస్థితులను సమూలంగా మార్చివేసిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠ్య పుస్తక విభాగం మూడేళ్లుగా ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాలతోపాటు ఉర్దూ మాధ్యమానికి సంబంధించిన అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో ముద్రించి, పాఠశాలలకు సరఫరా చేస్తోంది.
Also read: Engineering Courses: సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల సీట్ల కుదింపు.. ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం
ఒకే పేజీలో ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో పాఠ్యాంశాలు
గత ప్రభుత్వ పాలనలో ఉర్దూ పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ అనేది లేకుండా గడిపివేసిన పరిస్థితులను సమూలంగా మార్చి వేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉర్దూ పాఠ్య పుస్తకాలను మిర్రర్ ఇమేజ్ టెక్నాలజీతో పాఠ్యాంశాలను ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ముద్రిస్తోంది. ఉర్దూ మాధ్యమం చదివే విద్యార్థులు ఆంగ్ల భాషలో సైతం ప్రావీణ్యం సాధించే విధంగా మార్పులు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల సిలబస్‌ను సీబీఎస్‌ఈలోకి మార్చిన దృష్ట్యా ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు 8వ తరగతిలో కొత్త పాఠ్యాంశాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఉర్దూ మాధ్యమంలోనూ కొత్త పాఠ్యాంశాలతో పుస్తకాలను రూపొందించింది. గుంటూరు నగరంలోని ప్రభుత్వ పాఠ్య పుస్తక గోదాము నుంచి కొత్తగా వచ్చిన 8వ తరగతి పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు రవాణా చేస్తున్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని ఉర్దూ పాఠశాలలకు ప్రభుత్వ పాఠ్య పుస్తక మేనేజర్ వనమా వజ్రబాబు, ఉర్దూ పాఠశాలల ఉప తనిఖీ అధికారి షేక్ మొహ్మద్ ఖాసిం పాఠ్య పుస్తకాలను పంపిస్తున్నారు.
– ఫాహమిదాబేగం, ఎస్జీటీ, ఎంపీయూపీ ఉర్దూ పాఠశాల, గుళ్లపల్లి, నకరికల్లు మండలం
Also read: Private University: అందరికీ విద్య అందించేందుకే ప్రైవేట్ వర్సిటీలకు ఆమోదం : సబిత