Engineering Courses: సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల సీట్ల కుదింపు.. ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం
వీటి స్థానంలో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కొత్త కోర్సుల్లో సీట్లు పెరుగుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి కరుణ వాకాటి సెప్టెంబర్ 13న ఉత్తర్వులు విడుదల చేశారు. డిమాండ్ లేని కోర్సులను తగ్గించి, వాటి స్థానంలో డిమాండ్ ఉండే కోర్సులకు మారే అవకాశం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కల్పించింది. దీంతో రాష్ట్రంలోని 89 కాలేజీలు సివి ల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల స్థానంలో కంప్యూటర్ సైన్స్, ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు అనుమతి కోరాయి.
దీనికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో 9,240 వరకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ సీట్లు కనుమరుగవ్వనున్నాయి. ఇదే సంఖ్యలో కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సుల్లో సీట్లు పెరగనున్నాయి. కొన్ని కాలేజీలు 400 సీట్ల వరకు కంప్యూటర్ కోర్సుల్లో మారి్పడికి అనుమతి కోరాయి.
Also read: Private University: అందరికీ విద్య అందించేందుకే ప్రైవేట్ వర్సిటీలకు ఆమోదం : సబిత