JoSAA Counselling 2022: IITల్లో మరో 500 సీట్లు.. జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JOSAA) ద్వారా భర్తీ
కొత్త కోర్సులు రావడమే దీనికి ప్రధాన కారణం. గత ఏడాది కూడా బీటెక్ సీట్లు స్వల్పంగా పెరిగాయి. 23 ఐఐటీల్లో గత ఏడాది 16,053 నుంచి 16,232 సీట్లు (179 అదనం) పెరిగాయి. వీటిల్లో 1534 సీట్లను అమ్మాయిలకు సూపర్ న్యూమరరీ కింద కేటాయిస్తారు. బీటెక్‌లో బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్‌ఫర్మేటిక్స్, కంప్యూటేషనల్ ఇంజనీరింగ్, ఇండ్రస్టియల్ కెమిస్ట్రీ కోర్సులు ఈసారి అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీ ఐఐటీలో 40 సీట్లతో ఎనర్జీ ఇంజనీరింగ్, ఐఐటీ కాన్పూర్‌లో 22 సీట్ల తో స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్‌లో నాలుగేళ్ళ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) అందుబాటులోకి వచ్చింది. మరికొన్ని ఐఐటీల్లో కూడా ఈ ఏడాది కొత్త కోర్సులకు అనుమతి లభించింది.
Also read: Private University: అందరికీ విద్య అందించేందుకే ప్రైవేట్ వర్సిటీలకు ఆమోదం : సబిత
ఫలితంగా కనీసం 500 సీట్లు అదనంగా పెరిగే వీలుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక సంస్థల్లో మొత్తం 52 వేలకు పైగా సీట్లున్నాయి. వీటిని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ద్వారా భర్తీ చేసేందుకు ఇప్పటికే కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 12వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది.
Also read: Medical posts: దసరా కానుకగా వైద్య పోస్టులు భర్తీ చేస్తామన్న హరీశ్
ఐఐటీల్లో ఉన్న సీట్లు
కేటగిరీ | సీట్లు |
ఓపెన్ | 6,260 |
ఈడబ్ల్యూఎస్ | 1,526 |
ఎస్‌సీ | 2,304 |
ఎస్టీ | 1,161 |
ఓబీసీ | 4,165 |
కేంద్ర సంస్థల్లో సీట్లు
సంస్థ | సీట్లు |
23 ఐఐటీలు | 16,232 |
31 ఎన్‌ఐటీలు | 23,997 |
26 ట్రిపుల్‌ఐటీలు | 6,146 |
33 కేంద్ర సంస్థలు | 6,078 |
Also read: Infosys Employees : ఇన్ఫోసిస్ ఉద్యోగులకు భారీ షాక్.. ఈ రూల్స్ అతిక్రమిస్తే ఇక అంతే.. !