Medical posts: దసరా కానుకగా వైద్య పోస్టులు భర్తీ చేస్తామన్న హరీశ్
Sakshi Education
వైద్య, ఆరోగ్య శాఖలో వేలాది మంది డాక్టర్లు, స్టాఫ్‌నర్సుల పోస్టులను భర్తీ చేశామని తెలి పారు.
మరో వెయ్యి మంది నియామకాలకు దసరా కానుకగా ఉత్తర్వులు ఇస్తున్నా మని సెప్టెంబర్ 13న మంత్రి హరీశ్ వెల్లడించారు. వాటికి సంబంధించి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించనున్నామన్నారు. 800 మంది సీనియర్ రెసిడెంట్లను జిల్లా ల్లోని మెడికల్ కాలేజీల్లో కౌన్సెలింగ్ ద్వారానే నియమించామని తెలిపారు. ఇతర వైద్య సిబ్బందికి సంబంధించి కూడా వారం, పది రోజుల్లో నోటిఫికేఫషన్ జారీ చేస్తామన్నా రు. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని సంకలి్పంచినట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరుగుతాయన్నారు. దుబ్బాకకు వంద పడకల ఆసుపత్రిలో అన్ని సౌక ర్యాలు కల్పించామని హరీశ్ చెప్పారు.
Also read: Telangana Jobs: ఖమ్మం జిల్లాలో 35 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు.. నెలకు రూ.40,000 వరకు వేతనం..
Published date : 14 Sep 2022 05:48PM