PJTSAU: వ్యవసాయ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు
వ్యవసాయ, సేంద్రియ, ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా కోర్సులు, సీట్ల సంఖ్య, పాలిటెక్నిక్‌లలో ఉన్న ఫీజులు, వివరాలు తదితర సమగ్ర సమాచారం కలిగిన ప్రాస్పెక్టస్ విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www. pjtsau.edu.inలో పొందుపరిచినట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటరమణ జూన్ 8న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల కోసం జూలై మొదటి వారంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు.
చదవండి: Biotechnology : ఏజీ వర్సిటీలో జీవసాంకేతిక ఉపకరణాలపై శిక్షణ
పాలిసెట్–2023 ర్యాంకుల (అగ్రికల్చర్ స్ట్రీమ్) ప్రకారం మెరిట్ ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ విధానం అమలు చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 24 చివరి తేదీ అని తెలిపారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ చూడాలని సూచించారు.