10th Class Syllabus Change : ఇకపై 9, 10వ తరగతుల సిలబస్ ఇదే.. వచ్చే సంవత్సరం నుంచే..
ఈ మేరకు పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్యపుస్తకాల డైరెక్టర్ కె రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. 9వ తరగతిలో సిలబస్ పూర్తిగా మారనుంది.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ | మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
దీనిలో తెలుగు, హిందీ, ఆంగ్ల పాఠ్యపుస్తకాలతో పాటు ఉపవాచకాలు ఉంటాయి. అలాగే ఇంగ్లిస్ సబ్జెక్టుకు వర్క్‌బుక్ వస్తుంది. సాంఘిక శాస్త్రంలో నాలుగు టెక్స్ట్ బుక్స్, గణితంలో రెండు పుస్తకాలుంటాయని ఆయన అన్నారు. కొత్తగా ముద్రించే టెక్స్ట్ బుక్స్‌లో ఓ వైపు ఇంగ్లిష్, రెండో వైపు తెలుగు లేదా ఉర్దూ మీడియాల్లో ముద్రించబడి ఉంటాయని తెలిపారు.
ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ మేరకే..
ఒకటి నుంచి ఐదో తరగతుల వరకు ఇప్పటివరకూ ఉన్న మూడు సెమిస్టర్లను తొలగించి రెండు సెమిస్టర్ల విధానం అమల్లోకి రానున్నట్లు ఆయన తెలిపారు. 6, 7వ తరగతుల విద్యార్థులకు ఆంగ్లం, గణితం, సైన్స్ సబ్జెక్టులు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ మేరకు ఉంటాయన్నారు. 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో మార్పు ఉండదని డైరెక్టర్ తెలిపారు.
టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్