Skip to main content

Department of Technical Education: పాలీ టెక్‌ ఫెస్ట్‌–2022

సాక్షి, అమరావతి: విద్యార్థుల సృజనాత్మకత, వినూత్న ఆలోచనలను ఉత్తేజపరిచే క్రమంలో నవంబర్‌ 24 నుంచి మూడు రోజులపాటు విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌లో రాష్ట్ర స్థాయి పాలీ టెక్‌ఫెస్ట్‌–2022 నిర్వహిస్తున్నట్టు సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి నవంబర్‌ 23న ఒక ప్రకటనలో తెలిపారు.
Department of Technical Education
పాలీ టెక్‌ ఫెస్ట్‌–2022

మేక్‌ ఇన్‌ ఇండియా, నైపుణ్యం ఏపీ ప్రచారాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఆవిష్కరణలు, పరిశోధనలను సులభతరం చేస్తూ పాలిటెక్నిక్‌ విద్యార్థులకు దిక్సూచిగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని తెలిపారు.

చదవండి: Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

డిప్లొమా విద్యార్థులు టెక్నోక్రాట్‌గా రూపాంతరం చెందడానికి ఇది సోపానం వంటిదని, నవంబర్‌ 14 నుంచి 17 వరకు నోడల్‌ ప్రిన్సిపాల్స్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 13 ప్రదేశాలలో ప్రాంతీయ పాలీ టెక్‌ ఫెస్ట్‌ లు నిర్వహించామని పేర్కొన్నారు. దాదాపు 4,310 మంది విద్యార్థులు టెక్‌ఫెస్ట్‌లో పాల్గొని 1,084 వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారని, వాటిలో ఎంపిక చేసిన 253 ప్రాజెక్ట్‌లు విజయవాడలో ప్రదర్శితం కానున్నాయని నాగరాణి తెలిపారు. రాష్ట్ర స్థాయి పాలీ టెక్‌ ఫెస్ట్‌ ఉత్తమ ప్రాజెక్టులకు మొదటి బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.50 వేలు, తృతీయ బహుమతిగా రూ.25 వేలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రతిరోజూ రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌లు, పాఠశాల విద్యార్థులు 5,000 మంది సందర్శించగలిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 

చదవండి: POLYCET: బహుళ అవకాశాల.. పాలిటెక్నిక్‌

Published date : 24 Nov 2022 04:08PM

Photo Stories