Lovely Professional University: సీయూఈటీ ఆధారంగా LPUలో అడ్మిషన్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: సీయూఈటీ–2023 పరీక్ష ఆధారంగా తమ వర్సిటీలో అడ్మిషన్లు కల్పించనున్నట్లు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఒక ప్రకటనలో తెలిపింది.
సీయూఈటీ ఆధారంగా LPUలో అడ్మిషన్లు
ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. సీయూఈటీ పరీక్షలో వచ్చిన స్కోర్స్ ఆధారంగా ఎల్పీయూ లో స్కాలర్‌షిప్‌లు పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.
ఎల్పీయూలో అడ్మిషన్లకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 15 నుంచి 27వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపింది. సీట్ల కేటాయింపును 29న ప్రకటిస్తామంది. ఇక కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియకు జూలై 31 ఆఖరి తేదీ అని వెల్లడించింది.