APHERMC: ఎక్కువ ఫీజు వసూలు చేస్తే చర్యలు
మేరకు అన్ని విద్యాసంస్థలకు కమిషన్ మెంబర్ సెక్రటరీ, సీఈవో డాక్టర్ ఎన్.రాజశేఖర్‌రెడ్డి లేఖ రాశారు. యాజమాన్యాలు ఎక్కువ ఫీజు వసూలు చేయడం, సర్టిఫికెట్లు ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేయడం సహా పలు అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి కమిషన్‌కు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి విద్యాసంస్థ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను అందరికి కనిపించేలా విద్యాసంస్థల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలని సూచించారు. నిర్దేశించిన ఫీజు కన్నా అధికంగా వసూలు చేస్తే ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ 2019, ఏపీ విద్యాసంస్థల (Regulation of Admission and Prohibition of Capitation Fee)–1983 చట్టాల్లోని నిబంధనలను అనుసరించి శిక్షార్హులవుతారని హెచ్చరించారు. కోర్సు పూర్తయిన విద్యార్థుల సర్టిఫికెట్లను విద్యాసంస్థలు అట్టిపెట్టుకోరాదని పేర్కొన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి ముందస్తుగా ఫీజు వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కమిషన్ ఆకస్మిక తనిఖీలు చేసి విద్యార్థులతో మాట్లాడుతుందని, ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినట్లు తమదృష్టికి వస్తే ఆయా విద్యాసంస్థలకు పెనాల్టీ విధించడంతోపాటు సమస్య తీవ్రతను బట్టి అఫిలియేషన్‌ను రద్దుచేయడానికి సిఫార్సు చేస్తామని ఆయన తెలిపారు.
చదవండి: