Skip to main content

College Fees: ఈ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఫీజులుండాలి

జస్టిస్‌ శ్రీకృష్ణ కమిషన్‌ సిఫార్సులను అనుసరించి Engineering Undergraduate Courses ఫీజులను కనిష్టంగా రూ.79,600, గరిష్టంగా 1,89,800 చొప్పున నిర్ణయించాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు వినతిపత్రం అందించినట్లు రాష్ట్ర ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాల సంఘం ఆగస్టు 9న ఒక ప్రకటనలో తెలిపింది.
College Fees
ఈ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఫీజులుండాలి

Andhra Pradesh Higher Education Regulatory and Monitoring Commission (APHERMC) 2023–24 నుంచి 2025–26 బ్లాక్‌ పీరియడ్‌కు ఫీజుల నిర్ణయానికి ఆయా కాలేజీలు తమ ఆదాయ వ్యయ లెక్కలను సమర్పించాలని సూచించిందని సంఘం అధ్యక్షుడు చొప్పా గంగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మద్దిశెట్టి శ్రీధర్, కోశాధికారి కీర్తికుమార్‌ సత్రశాల పేర్కొన్నారు. శ్రీకృష్ణ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం ఫీజులు ఉంటేనే కాలేజీల నిర్వహణ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగుతుందన్నారు.ఇంజనీరింగ్‌ కాలేజీలకు పర్మినెంటు అఫ్లియేషన్‌పై నిబంధనలు సడలించాలన్నారు. ప్రోగ్రాం వారీగా అఫ్లియేషన్‌ విధానాన్ని అన్ని వర్సిటీలు అమలుచేస్తుండగా జేఎన్‌టీయూలు మాత్రం యూజీ కోర్సుల్లో స్టూడెంటు వారీగా.. పీజీ కోర్సుల్లో ప్రోగ్రాముల వారీగా అఫ్లియేషన్‌ ఫీజును వసూలు చేస్తున్నాయని తెలిపారు. పరిశ్రమలకు, నేటి అవసరాలకు తగ్గ అంశాల్లో డిగ్రీ, పీజీ కోర్సులను నిర్వహించేందుకు ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుమతివ్వాలని వారు కోరారు. కాలేజీల్లో విద్యార్థుల నుంచి యూనివర్సిటీ కామన్‌ సర్వీస్‌ ఫీజును, రూ.500 చొప్పున ఇన్సూరెన్సు ఫీజు వసూలుకు అనుమతించాలని యాజమాన్యాలు కోరాయి. 

చదవండి: 

Published date : 10 Aug 2022 03:17PM

Photo Stories