IIIT: హైదరాబాద్ సీఐఈకి 5 కోట్ల గ్రాంటు
Sakshi Education
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీం నుంచి స్టార్టప్ ఫండింగ్ గ్రాంట్ కోసం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లోని సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీఐఈ) ఎంపికైంది.
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద రూ. 5 కోట్లను గ్రాంట్‌గా అందిస్తారు. ఈ నిధులను ప్రీ రెవెన్యూ స్టేజ్ డీప్ టెక్ అండ్ రీసెర్చ్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెంచేందుకు వినియోగిస్తారు. డీప్‌టెక్, ఎంటర్‌ప్రైజ్ టెక్, ఎడ్యూటెక్, హెల్త్‌కేర్, మెడ్‌టెక్ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు చేసేందుకు సీఐఈ తోడ్పాటు అందిస్తుంది. ఈ పథకం కింద రాబోయే మూడేళ్లలో ట్రిపుల్ ఐటీ ఫౌండేషన్ ద్వారా దాదాపు 20 నుంచి 25 స్టార్టప్‌లకు మద్దతు అందజేయనుంది. ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్ ఎల్లప్పుడూ పరిశ్రమ, సమాజ హితం కోసం అవసరమైన పరిశోధనలు చేపట్టేందుకు దోహదపడుతుందని సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ పీజేనారాయణన్ పేర్కొన్నారు.
చదవండి:
Published date : 02 Dec 2021 04:30PM