World Steel Producers: ప్రపంచ స్టీల్ ఉత్పత్తిలో దూసుకుపోతున్న భారత్..!
Sakshi Education
ప్రపంచ స్టీల్ అసోసియేషన్ (డబ్ల్యూఎస్‌ఏ) తాజా నివేదిక ప్రకారం 2024 ఏప్రిల్ నెలలో ఉక్కు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిని సాధించింది.
✦ ఏప్రిల్ నెలలో చైనా, జపాన్, అమెరికా, రష్యా వంటి స్టీల్ ఉత్పత్తి దిగ్గజాల ఉత్పత్తి గణనీయంగా క్షీణించినప్పటికీ, భారత్ 3.6% వృద్ధితో 12.1 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది.
✦ ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు భారతదేశం 49.5 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసి 8.5% వృద్ధి సాధించింది, ఇది అత్యధిక వృద్ధి రేటు.
✦ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న భారత్, ఈ ఘనతను సాధించడంలో చైనాను వెనక్కి నెట్టింది.
✦ అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఉక్కుకు డిమాండ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
✦ అధిక వడ్డీ రేట్లు మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఇతర దేశాలలో ఉక్కు వినియోగ రంగాలలో డిమాండ్ మందగించింది.
✦ దేశీయంగా అధిక ఐరన్ ఓర్ దిగుమతులు ధరలను కూడా ప్రభావితం చేస్తున్నాయి.
World Economic Forum: ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్‌కు 39వ స్థానం!
Published date : 27 May 2024 11:37AM