World Economic Forum: ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్‌కు 39వ స్థానం!
Sakshi Education
ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) విడుదల చేసిన ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీ 2024 ప్రకారం భారతదేశం గణనీయమైన పురోగతి సాధించింది.
అంతర్జాతీయ పర్యాటక కార్యకలాపాలు మళ్ళీ కోవిడ్-19కి ముందు స్థాయికి చేరుకుంటున్నాయని డబ్ల్యూఈఎఫ్ వార్షిక నివేదిక వెల్లడించింది.
ఈ సూచికలో భారతదేశం ర్యాంక్ మెరుగై 39వ స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో అమెరికా తొలిస్థానంలో నిలిచింది. దక్షిణాసియాలో తక్కువ మద్యస్థాయి ఆధాయం కలిగిన దేశాలలో భారత్ తొలి స్థానంలో ఉంది. 2021లో డబ్ల్యూఈఎఫ్ ప్రకటించిన ఈ సూచిలో భారత్ 54వ స్థానంలో ఉంది. 2024 జాబితాలో అమెరికా, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
Indian Stock Market: చరిత్రాత్మక ఘనత సాధించిన భారత స్టాక్ మార్కెట్!
Published date : 22 May 2024 12:11PM