Skip to main content

Parag Agarwal: ట్విట్టర్‌ భారీ ప్యాకేజీ

ట్విట్టర్‌ సీఈవోగా పగ్గాలు చేపట్టిన భారతీయ అమెరికన్ పరాగ్‌ అగర్వాల్‌(37)కు భారీ వేతన ప్యాకేజీని కంపెనీ ప్రకటించింది.
Parag Agarwal
అగర్వాల్‌కు ట్విట్టర్‌ భారీ ప్యాకేజీ

వార్షిక వేతనంగా మిలియన్ డాలర్లను (రూ.7.5 కోట్లు) చెల్లించనుంది. దీనికి అదనంగా బోనస్‌లను కూడా చెల్లించనున్నట్టు యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్ఛంజ్‌ కమీషన్ కు కంపెనీ సమాచారం ఇచ్చింది. వార్షిక వేతనానికి అదనంగా.. రూ.12.5 మిలియన్ డాలర్ల (రూ.93.75కోట్లు) రెస్ట్రిక్టెడ్‌ స్టాక్‌ యూనిట్లను (ఆర్‌ఎస్‌యూ) 2020 ఫిబ్రవరి నుంచి 16 సమాన త్రైమాసిక వాయిదాల రూపంలో ఇవ్వనుంది. ట్విట్టర్‌ సీఈవో బాధ్యతల నుంచి వ్యవస్థాపకుడు జాక్‌ డార్సే గత నవంబర్‌ 29న తప్పుకోవడం, పరాగ్‌ అగర్వాల్‌కు ఆ బాధ్యతలు అప్పగించడం తెలిసిందే. అంతకుముందు వరకు అగర్వాల్‌ ట్విట్టర్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేశారు. ఐఐటీ బోంబేలో బీటెక్‌ పూర్తి చేసిన అగర్వాల్, తదనంతరం స్టాన్ ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేశారు.

డార్సేతో పోలిస్తే భారీ మొత్తమే

ట్విట్టర్‌ వ్యవస్థాపకుడైన జాక్‌ డార్సే 2019 సంవత్సరానికి సీఈవోగా అందుకున్న వేతనం కేవలం 1.4 డాలర్లే కావడం గమనార్హం. దాంతో పోలిస్తే పరాగ్‌ అగర్వాల్‌కు భారీ ప్యాకేజీనికే కంపెనీ ఖరారు చేసింది. ట్విట్టర్‌లో 2.26% వాటా డార్సేకు ఉంది. అంతేకాదు స్వే్కర్‌లోనూ ఆయనకు 11% వాటా ఉంది. స్క్వేర్‌ కంపెనీ మార్కెట్‌ విలువ (రూ.7.37 లక్షల కోట్లు) ప్రకారం చూస్తే డార్సే వాటా విలువ సుమారు రూ.74 వేల కోట్లు. అంతర్జాతీయ కోవిడ్‌ సహాయక ప్యాకేజీకి డార్సే బిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించడం గమనార్హం. 

చదవండి: 

Twitter: సీఈవోగా.. మనోడే!.. 11 ఏళ్లలోనే కీలక స్థానానికి..

కష్టాల నీడలో పెరిగా...అనుకున్న‌ రైల్వే ఉద్యోగాన్ని సాదించానిలా..

Published date : 02 Dec 2021 03:51PM

Photo Stories