SEBI Latest Notification: SEBIలో కొలువు.. లక్షకుపైగా వేతనం!
- 97 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్
- మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహణ
- ఎంపికైతే నెలకు రూ.1.11 లక్షల వేతనం
మొత్తం 97 పోస్ట్‌లు
సెబీ తాజా నోటిఫికేషన్ ప్రకారం–మొత్తం ఆరు విభాగాల్లో 97 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. వీటిల్లో జనరల్ విభాగంలో 62 పోస్టులు, లీగల్–5 పోస్టులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–24 పోస్టులు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్–2 పోస్టులు, రీసెర్చ్–2 పోస్టులు, అధికార భాష (అఫిషియల్ లాంగ్వేజ్)–2 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు
- ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్ట్‌లలో పీజీ/బీటెక్/బీఏ/బీకాం/ బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.
- వయసు: 2024, మార్చి 31 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
నెలకు రూ.1.11 లక్షల వేతనం
మూడు దశల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకుని.. నియామకం ఖరారు చేసుకున్న వారికి ప్రారంభంలోనే వసతి సదుపాయంతోపాటు నెలకు రూ.1.11 లక్షల వేతనం అందుతుంది. వసతి సదుపాయం లేకపోతే నెలకు రూ.1,49,500 వేతనం అందిస్తారు. వీటితోపాటు ఇతర అలవెన్స్‌లు కూడా లభిస్తాయి.
చదవండి: Bank Exam Guidance: 146 స్పెషలిస్ట్ ఆఫీసర్ కొలువులు.. రాత పరీక్ష, సిలబస్ అంశాలు ఇవే..
మూడు దశల ఎంపిక ప్రక్రియ
ఆయా విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌ల భర్తీకి మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. అవి.. ఫేజ్–1(ప్రిలిమినరీ రాత పరీక్ష), ఫేజ్–2(మెయిన్ రాత పరీక్ష), పర్సనల్ ఇంటర్వ్యూ.
ఫేజ్–1 పరీక్ష
ఎంపిక ప్రక్రియలో తొలిదశ రాత పరీక్ష (ఫేజ్–1.. 200 మార్కులు)లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1 మొత్తం 100 మార్కులకు గంట వ్యవధిలో నిర్వహిస్తారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్–2లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విభాగానికి సంబంధించిన సబ్జెక్ట్ నుంచి 50 ప్రశ్నలతో 100 మార్కులు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట నలభై నిమిషాలు.
ఫేజ్–2 ఇలా
ఫేజ్–1లో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు పది మందిని చొప్పున ఎంపిక చేసి ఫేజ్–2 పరీక్ష నిర్వహిస్తారు. ఫేజ్–2 పరీక్ష కూడా రెండు పేపర్లుగా ఉంటుంది. పేపర్–1: ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ టెస్ట్ (100 మార్కులు). ఇందులో ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్ ఉంటాయి. పేపర్–2ను ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ఎంచుకున్న స్పెషలైజేషన్ నుంచి 70 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు (70 మార్కులు), అదే విధంగా మూడు డిస్క్రిప్టివ్ ప్రశ్నలు (ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు) అడుగుతారు.
తుది దశ పర్సనల్ ఇంటర్వ్యూ
ఫేజ్–2లో కూడా విజయం సాధిస్తే నిర్దేశిత కటాఫ్ నిబంధనల ప్రకారం–అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి తుది దశలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలో అకడమిక్ నేపథ్యం, ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్, స్టాక్ మార్కెట్ కార్యకలాపాలపై ప్రశ్నలు ఉంటాయి.
వెయిటేజీ విధానం
పర్సనల్ ఇంటర్వ్యూ కూడా పూర్తయిన తర్వాత.. నియామకాలు ఖరారు చేసే క్రమంలో వెయిటేజీ విధానం పాటిస్తారు. ఫేజ్–2 రాత పరీక్షలో పొందిన మార్కులకు 85 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూ మార్కులకు 15 శాతం వెయిటేజీ కల్పిస్తారు. దీనికి అనుగుణంగా తుది జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2024, ఏప్రిల్ 13
- ఫేజ్–1 రాత పరీక్ష: జూన్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం.
- వివరాలకు వెబ్‌సైట్: https://www.sebi.gov.in/sebiweb/about/AboutAction.do?doVacancies=yes
రాత పరీక్షలో సక్సెస్ ఇలా
జనరల్ అవేర్‌నెస్
కరెంట్ అఫైర్స్, జీకేతోపాటు ఇటీవల కాలంలో జాతీయ ఆర్థిక రంగంలో మార్పులు, స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు, విధి విధానాలు, నూతన నిబంధనలు వంటి అంశాల గురించి తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన టెర్మినాలజీపై పట్టు సాధించాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
బేసిక్ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. డిస్క్రిప్టివ్ విధానంలో ఉండే ఇంగ్లిష్ ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ కోసం ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు చదవడం, ఎడిటోరియల్ లెటర్స్ చదవడం మేలు చేస్తుంది.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఈ విభాగానికి సంబంధించి అర్థమెటిక్‌పై పట్టు సాధించాలి. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు నంబర్ సిరీస్, డేటా అనాలిసిస్ విభాగాలను కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే.. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ మంచి మార్కులు పొందే
అవకాశం ఉంటుంది.
రీజనింగ్
రీజనింగ్ ప్రిపరేషన్‌లో అభ్యర్థులు సిరీస్, అనాలజీ, కోడింగ్–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, సిలాజిజమ్స్‌పై పట్టు సాధించాలి.
ప్రొఫెషనల్ నాలెడ్జ్
ఫేజ్–1, ఫేజ్–2లలో అభ్యర్థులు ఎంచుకున్న విభాగంలో ప్రశ్నలు అడుగుతారు. తాము దరఖాస్తు చేసుకున్న స్పెషలైజేషన్, దానికి సంబంధించి బ్యాచిలర్, పీజీ స్థాయి పుస్తకాలను చదవాలి. ముఖ్యమైన కాన్సెప్ట్‌లను అప్లికేషన్ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. ఆయా విభాగాలకు సంబంధించి గత ప్రశ్న పత్రాలు, ఇతర పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను సాధన చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.
ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ టెస్ట్
ఫేజ్–2లో పేపర్–1గా ఉండే ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో రాణించడానికి అభ్యర్థులు ఇంగ్లిష్ కాంప్రహెన్షన్‌పై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్‌లలో నైపుణ్యం కోసం ఇంగ్లిష్ దిన పత్రికల ఎడిటోరియల్స్‌ను చదవాలి. వాటి సారాంశంతో సొంతంగా వ్యాసాలు రాసే నైపుణ్యం పెంచుకోవాలి. లెటర్ రైటింగ్‌కు సంబంధించి పర్సనల్, బిజినెస్ లెటర్ల తీరు, పంక్చుయేషన్స్, లెటర్ స్వరూపం(బాడీ ఆఫ్ ద లెటర్)పై పూర్తి అవగాహన పొందాలి.
చదవండి: Central Govt jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్ ఇంజనీర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- SEBI Latest Notification
- SEBI Recruitment 2024
- Stock Exchange Board of India
- Officer Grade-A Assistant Manager posts
- Officer Grade-A Assistant Manager Jobs
- SEBI Assistant Manager Posts Information
- SEBI Assistant Manager Posts
- SEBI Application Eligibility
- SEBI Selection Procedure
- Syllabus
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications
- SEBI Recruitment
- SEBI Assistant Manager Posts
- Officer Grade-A
- Job Vacancy
- salary package
- application process
- Eligibility Criteria
- Hiring details
- Selection criteria
- Exam Syllabus