జాతీయ నైపుణ్య పోటీలకు 30 మంది ఎంపిక
మొత్తం 54 విభాగాల్లో 26 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 500 మందికిపైగా అభ్యర్థులు పోటీలకు హాజరుకానుండగా ఏపీ నుంచి యోగాతోపాటు మొత్తం 17 విభాగాల్లో 30 మంది విద్యార్థులు నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. ఇందులో ఇటీవల విశాఖలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో 16 విభాగాల్లో 20 మంది మొదటి, రెండు స్థానాలు సాధించినవారున్నారు. అలాగే ఇటీవల జాతీయస్థాయి నైపుణ్యాభివృద్ధి సంస్థ డెమో స్కిల్స్ కేటగిరీలో నిర్వహించిన జాతీయస్థాయి యోగా పోటీల్లో ఏపీ నుంచి నలుగురితో పాటు మెరిట్ కోటాలో కొంతమందిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరందరికీ ఇప్పటికే ఆయా ట్రేడ్స్ లో ప్రముఖ కంపెనీలు, సంస్థలకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇప్పిస్తున్నట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ తెలిపింది.
చదవండి:
Career Opportunities: సైబర్ సెక్యూరిటీ.. భవితకు భరోసా!
Forensic Science: నేరాలకు చెక్.. ఫోరెన్సిక్ సైన్స్‌తో కెరీర్ అవకాశాలు..