IIIT: 30 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఉద్యోగాలు
జార్ఖండ్‌లోని ఉక్కు పరిశ్రమైన శ్రీబీర్ ఇండస్ట్రీస్ ప్లేస్‌మెంట్స్‌కు 58 మంది విద్యార్థులు హాజరవ్వగా వారిలో 26 మంది ఎంపికయ్యారు. ఎంపిౖకైనవారికి ఆరునెలల పాటు శిక్షణనిచ్చి అనంతరం ఉద్యోగంలో చేర్చు కుంటారు. శిక్షణ కాలంలో నెలకు రూ.15 వేలు స్టైపెండ్‌ను, అనంతరం రూ.3 లక్షల వార్షిక వేతనాన్ని ఇవ్వనున్నారు. మరో ముగ్గురు విద్యార్థులు టీసీఎస్‌కు, ఒక విద్యార్థి ‘ఫర్ ఏ’ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ఎంపికయ్యారు.
చదవండి: IIIT Hyderabad: వైఫై బదులు వై–సన్..
నేడు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో మిగిలిన 460 సీట్ల భర్తీకి గాను అక్టోబర్ 31న ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇందులో జనరల్ కేటగిరీలో 446, స్పెషల్ కేటగిరీలో 14 సీట్లు మిగిలాయి. వీటి భర్తీకి గాను అభ్యర్థులకు ఈ నెల 26నే కాల్ లెటర్లు, మెసేజ్‌లను వర్సిటీ పంపించింది. వర్సిటీ వెబ్‌సైట్‌లో కూడా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఉంచి, కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అభ్యర్థులందరూ ఒరిజినల్ ధృవపత్రాలతో ఈ నెల 31న ఉదయం 8 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.