Skip to main content

National Women VCs of Higher Education: విద్యాసంస్థలతో చర్చలు

తిరుపతి ఎడ్యుకేషన్‌ : అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని వివిధ విద్యాసంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆయా దేశాల అధికార ప్రతినిధులతో చర్చించినట్లు శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీ డి.భారతి ఒక ప్రకటనలో తెలిపారు.
National Women VCs of Higher Education
విద్యాసంస్థలతో చర్చలు

హర్యాణా రాష్ట్రం గుర్గావ్‌ ఐఐఎల్‌ఎం, అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ సంయుక్తంగా గత రెండు రోజులుగా నిర్వహించిన ఉన్నత విద్యా జాతీయ మహిళా వీసీల సదస్సు జూలై 18తో ముగిసింది. ఈ సదస్సుకు మహిళా వర్సిటీ వీసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెరికా, ఆస్ట్రేలియా అధికార ప్రతినిధులతో అవగాహన ఒప్పందాలపై చర్చించామని, తద్వారా ఉన్నత విద్యను అంతర్జాతీయంగా మరింత ముందుకు తీసుకెళ్లొచ్చని వీసీ అభిప్రాయపడ్డారు.

చదవండి:

SPMVV: ఘనంగా మహిళా వర్సిటీ స్నాతకోత్సవం

పద్మావతి మహిళా వర్సిటీలో రెండు కొత్త కోర్సులు

Published date : 19 Jul 2023 05:55PM

Photo Stories