పద్మావతి మహిళా వర్సిటీలో రెండు కొత్త కోర్సులు
Sakshi Education
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఎంఎస్సీ క్లినికల్ సైకాలజీ, కౌన్సెలింగ్ సైకాలజీ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ డి.జమున గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
బీఏ, బీఎస్సీలో సైకాలజీ చదివిన వారు, బయాలజీ, హోం సైన్స్, నర్సింగ్, బీఏ సోషల్ వర్క్, బీహెచ్‌ఎంఎస్ పూర్తి చేసినవారు ఈ కోర్సులకు అర్హులన్నారు. పూర్తి వివరాలకు ఎస్‌పీఎంవీవీడీఓఏ.ఐఎన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
Published date : 26 Jun 2020 03:28PM