Department of Health: వీరికి భారీగా వేతనాల పెంపు.. ప్రొబేషన్ రెండేళ్లకు కుదింపు
Sakshi Education
ఏపీ వైద్య విధాన పరిషత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషాలిటీ) వైద్యుల కన్సాలిడేటెడ్ వేతనాన్ని రూ.53,500 నుంచి రూ.85 వేలకు ప్రభుత్వం పెంచింది.
ప్రొబేషన్ కాలాన్నీ మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఏప్రిల్ 18న ఉత్తర్వులిచ్చారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ గిరిజన ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు వేతనాల్లో ప్రోత్సాహకాలను ప్రకటించారు. బేసిక్ పే మీద స్పెషాలిటీ వైద్యులకు 50%, సాధారణ వైద్యులకు 30% ప్రోత్సాహకం ఇచ్చారు. ఆ వెంటనే స్పెషలిస్ట్ వైద్యులకు కన్సాలిడేట్ వేతనాలను పెంచడం గమనార్హం. 2020లో జీవో నంబర్ 60 ద్వారా నియమితులైన వైద్యులకు ఏప్రిల్ నుంచి పెంచిన వేతనాలు అమల్లోకొస్తాయి. తాజాగా నియమితులయ్యే వైద్యులకూ రూ.85 వేల కన్సాలిడేటెడ్ వేతనాన్ని ఖరారు చేశారు.
చదవండి:
ఎంబీబీఎస్‌తో.. కేంద్రంలో వైద్య కొలువు
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు.. పరీక్షా విధానం ఇలా..
Published date : 19 Apr 2022 11:49AM