Skip to main content

Open School: ‘ఓపెన్‌’ పరీక్షలు ప్రారంభం

విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు అక్టోబ‌ర్ 16న‌ ప్రారంభమయ్యాయి.
Open School,Warangal Open School Exams Underway,Vidyaranyapuri Open School Tenth Exams in Progress
‘ఓపెన్‌’ పరీక్షలు ప్రారంభం

హనుమకొండలోని ప్రాక్టీసింగ్‌ హైస్కూల్‌, పెట్రోల్‌పంపు హైస్కూల్‌ పరీక్ష కేంద్రాలను డీఈఓ ఎండీ అబ్దుల్‌హై, ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ ఎం శంకర్‌రావు సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. రెండు పూటలు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

చదవండి: NCC Discipline: ఎన్‌సీసీ వంటి క్ర‌మ‌శిక్ష‌ణే విజ‌యానికి పునాది

ఒకరికి బదులు మరొకరు..

వరంగల్‌లోని మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌ పరీక్షలో తొలిరోజు తెలుగు పరీక్షలో ఒకరికి బదులు మరొకరు (ఇన్‌పర్సనేషన్‌ మాల్‌ప్రాక్టీస్‌).. ఇలా ఆరుగురు పరీక్షలు రాస్తూ ఇన్విజిలేటర్లకు పట్టుబడ్డారు. దీంతో ఆరుగురిపై చీఫ్‌ సూపరింటెండెంట్‌ అరుణ.. వరంగల్‌ మట్టెవాడ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Published date : 17 Oct 2023 02:46PM

Photo Stories