NCC Discipline: ఎన్‌సీసీ వంటి క్రమశిక్షణే విజయానికి పునాది
![Andhra Battalion leader emphasizing discipline in NCC, NCC students,NCC training camp promotes moral values, says commanding officer](/sites/default/files/images/2023/11/28/ncc-displine-1701145356.jpg)
సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థి దశ నుంచే క్రమ శిక్షణ అలవరుచుకోవాలని, దానికి మంచి వేదిక ఎన్‌సీసీ అని, అలా నేర్చుకున్న క్రమశిక్షణే విజయానికి పునాది అని 25 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఎస్‌సీ సిద్ధూ అన్నారు. పట్టణంలోని ఆక్స్‌ఫర్డ్ విద్యా సంస్థ ప్రాంగణంలో 10 రోజుల ఎన్‌సీసీ వార్షిక శిక్షణ శిబిరం ఆదివారం ప్రారంభమైంది. ఆయన మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన శిక్షణను ఈ శిబిరంలో అధికారులు క్యాడెట్‌లకు అందించడం జరుగుతుందని అన్నారు.
Web Counselling: స్విమ్స్ లో వెబ్ కౌన్సెలింగ్
విద్యార్థులలో దేశభక్తి సేవా తత్పరత పెంపొందించవచ్చునని, నిజ జీవితంలో ఒక మంచి పౌరుడిగా ఎదగటానికి ఈ శిక్షణ దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో మొత్తం 690 మంది ఎన్‌సీసీ క్యాడెట్‌లు పొల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఎస్‌ఎం విజయ్ మోహితే, ఏఎన్‌ఓలు జేవీ రావు, ఇమ్మానియేల్ రాజు, నాగరాజు, నాగార్జున, చిన కోటేశ్వరావు, సూపరింటెండెంట్‌లు యశోద, అనిల్‌కుమార్, ఆర్మీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.